భారత సంతతికి చెందిన ప్రముఖులతో ప్రధాని సంభాషణ

February 08th, 02:48 pm

మలేషియాలోని పలువురు ఎంపిక చేసిన భారత సంతతి ప్రముఖులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. వీరిలో మంత్రులు, సెనెటర్లు, పార్లమెంటు సభ్యులతోపాటు ఆజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సేన - ఐఎన్ఏ)కు చెందిన వీర యోధులు కూడా ఉన్నారు. డిజిటల్ శాఖ మంత్రి తువాన్ గోబింద్ సింగ్ దేవ్, మానవ వనరుల శాఖ మంత్రి దాతో శ్రీ రమణన్ రామకృష్ణన్, ప్రధానమంత్రి విభాగంలో డిప్యూటీ మంత్రి తువాన్ ఎం. కులశేఖరన్, దేశ ఐక్యత డిప్యూటీ మంత్రి తువాన్ ఆర్. యునేశ్వరన్ తదితరులు భారత ప్రధానమంత్రితో భేటీ అయ్యారు.