శ్రీ రామ్ స్వరూప్ శర్మ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
March 17th, 01:15 pm
‘‘శ్రీ రామ్ స్వరూప్ శర్మ అంకిత భావం కలిగిన నాయకుడు; ఆయన ప్రజల సమస్య లను పరిష్కరించడం కోసం ఎల్లవేళలా నిబద్ధత తో నడచుకొన్నారు. సమాజం అభ్యున్నతి కి గాను ఆయన అలుపెరుగక కృషి చేశారు. ఆయన అకాలిక మరణం దురదృష్టకరం. ఈ సంగతి తెలిసి నేను వ్యధితుడిని అయ్యాను. ఈ దుఃఖ ఘడియ లో, ఆయన కుటుంబాని కి, ఆయన మద్ధతుదారుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.