భూటాన్ రాజు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 11th, 12:00 pm

బాధ్యులందరినీ చట్టం ఎదుట నిలబెడతాం.

భూటాన్‌లోని థింఫులో చాంగ్లిమెథాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 11th, 11:39 am

భూటాన్ కు, భూటాన్ రాజ కుటుంబానికి, ప్రపంచశాంతిని కోరే ప్రతి ఒక్కరికీ ఇవాళ ముఖ్యమైన రోజని ప్రధానమంత్రి అన్నారు. భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా ఉన్న బలమైన భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను ఆయన వివరించారు. ఇలాంటి కీలక సందర్భంలో తాను ఇక్కడికి రావడం భారతదేశపు ప్రాధాన్యత మాత్రమే కాదు..అది తనది కూడానని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రమంలో తాను బరువెక్కిన హృదయంతో భూటాన్ కు వచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. బాధిత కుటుంబాల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని, దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత ఏజెన్సీలు ఈ కుట్రను బయటపెడతాయని, దాడికి కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కుట్రదారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామని తెలిపారు.

బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను (104 కి.మీ)

September 24th, 03:05 pm

బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను డబ్లింగ్ చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 104 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టును రూ. 2,192 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

బీహార్‌లోని పూర్ణియాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 15th, 04:30 pm

గౌరవనీయులైన గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, విశేష ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులతోపాటు సభకు హాజరైన నా ప్రియతమ సోదరీసోదరులారా!

బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి

September 15th, 04:00 pm

బీహార్‌లోని పూర్ణియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్ణియా ప్రాంతం మాతా పురాణ్ దేవి, భక్త ప్రహ్లాదుడు, మహర్షి మెహిబాబాల ఫుణ్యభూమి అని వ్యాఖ్యానించారు. ఈ నేల ఫణీశ్వరనాథ్ రేణు, సతీనాథ్ బాధురి వంటి సాహిత్య దిగ్గజాలకు జన్మనిచ్చిందన్నారు. ఈ ప్రాంతాన్ని వినోబా భావే వంటి అంకితభావంతో పనిచేసిన కర్మయోగుల భూమిగా అభివర్ణించారు. ఈ భూమి పట్ల తనకున్న ప్రగాఢమైన భక్తిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఆసియా కప్-2025లో భారత పురుషుల హాకీ జట్టు అసాధారణ విజయం.. ప్రధానమంత్రి అభినందనలు

September 08th, 07:20 am

బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో అద్భుత గెలుపును సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘గతంలో విజేతలైన దక్షిణ కొరియా జట్టుపై ఆధిపత్యాన్ని సాధించిన కారణంగా ఈ విజయం మరింత ప్రత్యేకమైంద’’ని శ్రీ మోదీ అభివర్ణించారు.

బీహార్లోని రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సవం నాడు పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

August 28th, 09:33 pm

బీహార్లోని చారిత్రక నగరం రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సమైన ఆగస్టు 29న ప్రారంభమయ్యే పురుషుల హకీ ఆసియా కప్ 2025‌లో ఆసియా వ్యాప్తంగా పాల్గొనే జట్లు, క్రీడాకారులు, అధికారులు, వారి అభిమానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్‌షిప్ 2025, ఐఎస్‌టీఏఎఫ్ సెపక్‌తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా ఇటీవలి కాలంలో శక్తిమంతమైన క్రీడాకేంద్రంగా తనదైన ముద్ర వేసిన బీహార్‌ను అమిభనందించారు.

The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar

June 19th, 10:31 am

PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.

బిహార్‌, రాజ్‌గిర్ లో నిర్మించిన న‌లందా విశ్వ‌విద్యాల‌య క్యాంప‌స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

June 19th, 10:30 am

బిహార్‌, రాజ్‌గిర్ లో నిర్మించిన న‌లందా విశ్వ‌విద్యాల‌య క్యాంప‌స్ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా ప్రారంభ‌మైంది. భార‌త‌దేశం, తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర దేశాలు క‌లిసి ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఈ ప్రారంభోత్ప‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 17 దేశాల మిష‌న్స్ అధ్య‌క్షుడు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఒక మొక్క‌ను నాటారు.