ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చ కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 29th, 05:32 pm
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు నేను పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా- ఈ సమావేశాన్ని దేశ కీర్తిప్రతిష్ఠలను ప్రస్తుతించేదిగా, భారత్ ‘విజయోత్సవం’గా పరిగణిద్దామని గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేశాను.లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 29th, 05:00 pm
పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 22నాటి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో ఈ రోజు ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దీన్ని శక్తియుత, నిర్ణయాత్మక, విజయవంతమైన సైనికచర్యగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు దీనిపై మీడియా సోదరులతో తన సంభాషణను ప్రధాని ముందుగా సభకు గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాలను భారత విజయోత్సవంగా, దేశ కీర్తిప్రతిష్ఠలకు నివాళిగా పరిగణించాలని గౌరవనీయ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
July 25th, 10:09 am
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.