కేరళంలోని ఎర్నాకుళంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 11th, 02:00 pm

కొచ్చి నగర సందర్శన నాకు సదా అద్భుత అనుభవం. ఉత్సాహం పొంగులు వారే ఈ తీరప్రాంత నగరం నుంచి కేరళం రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే అవకాశం ఇవాళ నాకు లభించింది. తదనుగుణంగా కొద్దిసేపటి కిందటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి దాదాపు రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.

కేరళంలోని ఎర్నాకుళంలో సుమారు రూ.11,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 11th, 01:30 pm

తీర ప్రాంత నగరం కొచ్చి పర్యటన నేపథ్యంలో కేరళం అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. కొచ్చి పర్యటన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ నూతన ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా కేరళం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని ఆయన తెలిపారు.

ప్రధానితో కేరళ గవర్నర్ భేటీ

January 10th, 07:48 pm

ప్రధాన మంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో ఈ విషయం పోస్ట్ చేసింది;