రాజ్యసభ సభ్యుడు శ్రీ రాజీవ్ శాతవ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
May 16th, 11:52 am
రాజ్యసభ సభ్యుడు శ్రీ రాజీవ్ శాతవ్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘పార్లమెంటులో నా మిత్రుడైన శ్రీ రాజీవ్ శాతవ్ గారు తుదిశ్వాస విడిచారన్న వార్త నన్నెంతో ఆవేదనకు గురిచేసింది. ఆయన ఎంతో సమర్థుడైన వర్ధమాన నాయకుడు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను… ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.