హర్యానాలోని జింద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 12:00 pm
హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు... అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు... కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు... హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు, సాంకేతిక మాధ్యామాల ద్వారా అనేక ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన హర్యానాలోని నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నమస్కారం!హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 11:30 am
హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి రావడం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శక్తి పీఠం మాతా జయంతి ఆశీస్సులు పొందిన ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చారిత్రక, సైనిక, ఆధ్యాత్మిక వారసత్వం గురించి వివరించారు. దశాబ్దాల క్రితం సంస్థాగత కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు లభించిన ఆప్యాయతను, ముర్రా గేదె పాలు, దేశీ బురా, ఘేవార్ లాంటి స్థానిక వంటకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది సాధారణ ప్రదేశం కాదు. ఇది చరిత్ర, ధైర్యం, మతం, అపారమైన గర్వానికి ప్రతీకగా నిలిచే భూమి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం
June 20th, 05:13 pm
గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 20th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
June 14th, 08:37 pm
జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)
June 09th, 07:20 pm
PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.Cabinet approves road upgradation projects in Madhya Pradesh worth Rs. 4,415.60 Crore
June 03rd, 03:29 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved upgradation of Hiwarkhedi-Roshni-Ashapur-Rudhy Section of NH-347B and widening of Deshgaon-Julwaniya Section of NH-347B in Madhya Pradesh at a cost of Rs.4,415.60 Crore. The upgraded corridor will enhance multi-modal integration by connecting with 6 PM Gati-Shakti Economic Nodes, 5 social nodes and 5 Logistic Nodes, thereby facilitating faster movement of goods and passengers across the region.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.డిఎంకె విధానం కుటుంబం, కుటుంబం మరియు కుటుంబం కోసం: తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ
April 18th, 06:20 pm
ఎన్నికలు, కోయంబత్తూరు, తమిళనాడు, BJP, లార్డ్ మురుగన్, పుతాండు, నారీ శక్తి వందన్ అధినియం, నారీ శక్తి, మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ బిల్లు, పార్లమెంట్, అవినీతి, హైవే, రోడ్‌వేలు, నెక్స్ట్ జనరేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రైల్వే, ఇన్‌క్లూజివ్ గ్రోత్, C. P. రాధాకృష్ణన్, బిజ్లి యోర్జాఫ్ట్ పెట్టుబడి, ఉద్యోగాలు, జల్ జీవన్ మిషన్, ముద్ర, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, వ్యాపారం, ఆదాయపు పన్ను, GST బచత్ ఉత్సవ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆయుష్మాన్ భారత్ యోజన, జన్ ఔషధి కేంద్రం, యువ శక్తి, మొదటిసారి ఓటర్లు, జనాభా గణన, ఎఫ్‌ఎస్‌ఎంఈ, వ్యవసాయం ఉపాధి, వికసిత భారత్ వికసిత తమిళనాడు,ప్రధాని మోదీ ప్రజ్వలన ప్రసంగం కోయంబత్తూరును ఉత్తేజపరిచింది
April 18th, 06:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరులో అత్యంత ఉత్సాహభరితంగా, రాజకీయంగా ఉత్తేజం కలిగించే ప్రసంగం చేయగా, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలు ఒక స్పష్టమైన సందేశం పంపుతున్నారని అన్నారు: “ఎన్డీఏ లోపల ఉంది, డీఎంకే బయట ఉంది.”Gujarat’s biggest strength is that it has kept development moving continuously for the past 25 years: PM Modi in Vav-Tharad
March 31st, 05:00 pm
PM Modi launched and dedicated multiple development projects in Vav-Tharad, Gujarat, worth nearly ₹20,000 crore. Addressing a large gathering, he highlighted initiatives across roads, railways, power, water supply, urban development, healthcare and tourism aimed at boosting connectivity, improving public services and accelerating socio-economic growth in the region while strengthening the vision of a Viksit Bharat.గుజరాత్‌లోని వావ్-థరద్‌లో ₹20,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం... శంకుస్థాపన.. దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 31st, 04:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా వావ్-థరద్‌లో ఉత్తర గుజరాత్ కోసం సుమారు ₹20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవిత్ర నవరాత్రి వేడుక ఇప్పుడే ముగియగా, ఇవాళ భగవాన్ మహావీర్ జయంతి కూడానని గుర్తుచేశారు. అలాగే, అంబాజీ మాత, భగవాన్ శ్రీ ధరణీధర్‌లకు నివాళి అర్పించారు.అనువాదం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
March 23rd, 02:15 pm
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, వాటి వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడటానికి నేను ఈ గౌరవనీయ సభ ముందుకు వచ్చాను. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. గత రెండు మూడు వారాలుగా శ్రీ జైశంకర్ గారు, శ్రీ హర్దీప్ పూరీ గారు ఈ విషయంపై అవసరమైన తాజా సమాచారాన్ని ఈ సభకు అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై దీని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం అన్వేషించాలని ప్రపంచమంతా అన్ని పక్షాలను కోరుతోంది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 23rd, 02:00 pm
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల భారత్ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, మానవ జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దీనిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. ‘‘ఈ సంక్షోభాన్ని వీలైనంత తర్వగా పరిష్కరించాలని అన్ని పక్షాలకు ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తోంది’’ అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.Cabinet approves construction of Twin Tube TBM road Underwater tunnel and a Railway project in Assam
February 14th, 12:56 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the construction of a 4-lane access-controlled greenfield connectivity corridor from Gohpur on NH-15 to Numaligarh on NH-715, including a 15.79 km road-cum-rail tunnel under the River Brahmaputra, worth Rs. 18,662 crore in Assam. The project will enhance the efficiency of freight movement, reduce logistics costs and drive socio-economic growth in the North Eastern region.‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 08:30 pm
ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు హాజరైన మీకందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు” అనే ఇతివృత్తం ప్రాతిపదికగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వినీత్ గారి ప్రసంగం విన్న తర్వాత, నా పని చాలా సులభమైందని భావిస్తున్నాను. అయితే, నాదొక చిన్న అభ్యర్థన- మీకు దీనిపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో అది ‘ఈటీ’లోనూ ప్రతిబింబిస్తూంటుంది.‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
February 13th, 08:00 pm
న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన ‘ఈటీ నౌ’ (ET Now) అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సుకు హాజరైన వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదస్సు ఇతివృత్తం “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు”ను ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్ అద్భుత ప్రగతి సాధించిందని సగర్వంగా ప్రకటించారు. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ 11వ స్థానంలో ఉండేదని, గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూలాడేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ పరిణమాశీల శతాబ్దానికి భారత్ కీలక మూలస్తంభంగా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికిపైగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేగాక ఏటికేడు ఈ వాటా పెరుగుతూనే ఉంటుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకంగా ఆవిర్భవించగలదని ఆయన స్పష్టం చేశారు.అనువాదం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 05th, 05:35 pm
ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.