సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ శ్రీ రఘు రాయ్ కన్నుమూత... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

April 26th, 08:34 pm

సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ శ్రీ రఘు రాయ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీ రఘు రాయ్ సృజనాత్మక దిగ్గజాల్లో ఒకరని, తన లెన్స్ ద్వారా భారత సజీవత్వాన్ని అమరమైందిగా తీర్చిదిద్దారని ప్రధాని వర్ణించారు. శ్రీ రఘు రాయ్ ఛాయాచిత్ర కళ అసాధారణ సున్నితత్వం, గాఢత, వైవిధ్యంతో పరిపూర్ణమైందని, భారత జన జీవనంలో విభిన్న కోణాల్ని ఆయన ఒడిసిపట్టి ప్రజల చెంతకు చేర్చారని శ్రీ మోదీ అన్నారు. ఫోటోగ్రఫీ లోకానికి, సంస్కృతికి శ్రీ రఘు రాయ్ అందించిన తోడ్పాటు సాటి లేనిదని, ఆయన నిష్క్రమణ కళాజగతికి తీరని లోటు అని ప్రధానమంత్రి అన్నారు.