Together, we can build global solutions: PM Modi at the Economic Roadmap Business Reception in Melbourne, Australia

July 09th, 06:15 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event

July 09th, 06:00 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన

July 02nd, 10:22 pm

జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

June 06th, 06:22 pm

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 05th, 04:30 pm

విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!

గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 05th, 04:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్‌ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

April 15th, 11:15 am

పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

March 29th, 11:30 am

ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకున్న ప్రధానమంత్రి

February 01st, 09:00 pm

పంజాబ్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌‌ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు.

సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా, ఫిబ్రవరి 1న పంజాబ్‌లో పర్యటించనున్న పీఎం

January 31st, 10:48 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1, 2026న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆదంపూర్ విమానాశ్రయాన్ని సందర్శించి, 'శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్‌పోర్టు, ఆదంపూర్'గా కొత్త పేరును ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. లుథియానాలోని హల్వారా ఎయిర్‌పోర్టులో టెర్మినల్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

January 28th, 09:35 am

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. తల్లి భారతి బానిసత్వ సంకెళ్లు తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ ధారపోశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే

September 09th, 05:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 9న పంజాబ్‌ చేరుకుని… వరద పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు.

ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

August 12th, 03:18 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

శ్రీ సుఖ్ దేవ్ సింగ్ ధింసా గారి మరణంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

May 28th, 09:34 pm

శ్రీ సుఖ్ దేవ్ సింగ్ ధింసా గారి మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘‘గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావే కాకుండా, ప్రజాసేవపట్ల తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో పంజాబ్ తోనూ, ప్రజలూ, వారి సంస్కృతులతో ఆయన మమేకం అయ్యారు’’ అని శ్రీ మోదీ వాఖ్యానించారు.

పంజాబ్, హర్యానాలో మిశ్రమ వార్షిక చెల్లింపు విధానంలో రూ. 1878.31 కోట్లతో 19.2 కి.మీ. పొడవైన 6 వరుసల రద్దీ రహిత జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

April 09th, 03:09 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. పంజాబ్, హర్యానాల్లో ఎన్‌హెచ్ (ఓ) కింద, మిశ్రమ వార్షిక చెల్లింపు విధానంలో ఆరు వరుసల జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-7 (జిరాక్‌పూర్-పటియాలా) జంక్షన్ నుంచి మొదలై జాతీయ రహదారి-5 (జిరాక్‌పూర్- పర్వనూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 19.2 కి.మీ. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక కింద సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.

జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 13th, 12:30 pm

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…

జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 13th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

పంజాబ్ లోని బతిందాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం

December 27th, 07:31 pm

పంజాబ్ లోని బతిందాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు.

ఢిల్లీలో వీర బాల దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

December 25th, 01:58 pm

దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.

రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం

October 09th, 04:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కి.మీ. రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.