సీషెల్స్‌ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

June 28th, 02:02 pm

అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

June 23rd, 03:39 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి డాక్టర్ ముఖర్జీ అందించిన అపార సేవలను ప్రధాని స్మరించుకున్నారు.

న్యూఢిల్లీలో నిర్వహించిన ‘రిపబ్లిక్‌ సమ్మిట్‌-2026’లో ప్రధానమంత్రి ప్రసంగం

June 22nd, 10:24 pm

రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.

‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 22nd, 08:00 pm

రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.

ఆవిష్కరణలపై భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక ప్రణాళిక-2030

June 15th, 05:42 am

భారత్‌-ఫ్రాన్స్‌ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.

వరుసగా అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్

June 10th, 01:50 pm

భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 జూన్ 10ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నిరంతరాయంగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీని ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952 నుంచి 1964 వరకు వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు. దేశమే ప్రథమమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకుడికి ప్రజలు అందించిన అపూర్వమైన మద్దతుకు ఈ ఘట్టం అద్దం పడుతోందని, భారత ప్రజాస్వామ్య చేతనకు, ప్రజా విశ్వాసానికి, ప్రజా భాగస్వామ్య శక్తికి ఇది ప్రతీక అని ఈ తీర్మానంలో కేబినెట్ పేర్కొన్నది.

సుపరిపాలన అందించేందుకు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ప్రజా సేవ అతిపెద్ద పరీక్ష వంటిదని ప్రస్తావిస్తూ, సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 10th, 11:00 am

సుపరిపాలనకు ప్రజాసేవే అతిపెద్ద పరీక్ష అని పేర్కొంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. వినయం, అంకితభావం, కర్తవ్యం పట్ల నిబద్ధతతో పనిచేసే వారు ప్రజల విశ్వాసాన్ని పొందగలరని ప్రధానమంత్రి అన్నారు.

విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గత 12 ఏళ్ల ప్రభుత్వ పాలన అంకితమైందన్న ప్రధానమంత్రి

June 09th, 10:30 am

గత 12 ఏళ్ల ప్రభుత్వ పాలన.. విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులు, దేశమే తొలి ప్రాధాన్యత అనే భావనతో యువత, మహిళలు, రైతు సోదరీసోదరులు సాధికారత కోసం శాయశక్తులా కృషి చేసేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు.

సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాలను వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 09th, 10:27 am

సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాల్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 05th, 04:30 pm

విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!

గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 05th, 04:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్‌ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జూన్ 5న సూరత్, దమన్‌లలో ప్రధానమంత్రి పర్యటన

June 04th, 10:03 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26న గుజరాత్, దమన్‌లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు, ప్రధానమంత్రి సూరత్ జిల్లా హజీరాలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, సూరత్‌లో సుమారు రూ.18,800 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమివ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

May 31st, 11:15 am

లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆమెకు నివాళి అర్పించారు.

దివంగత నేత శ్రీ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

May 28th, 09:56 am

దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.

బీహార్ ముఖ్యమంత్రిగా శ్రీ సమ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం.. ప్రధానమంత్రి అభినందనలు

April 15th, 02:41 pm

బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ సమ్రాట్ చౌధరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ... ప్రజా శ్రేయస్సు కోసం మేధస్సు, ఏఐల లక్షణాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

February 17th, 08:53 am

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి నిజంగా ఉపయోగకరంగా మార్చడంలో మేధస్సు, హేతుబద్ధత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన... పౌరులందరి సంక్షేమం కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోగల మార్గాలను అన్వేషించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

'నాగరికదేవో భవ' స్ఫూర్తితో 'సేవా తీర్థ్'ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతకు చిహ్నంగా ‘సేవా తీర్థ్’

February 13th, 05:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థ్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజలకు సేవ చేయాలనే తన అచంచల సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ... 'నాగరికదేవో భవ' పవిత్ర స్ఫూర్తిని దానికి మార్గదర్శక శక్తిగా ప్రకటించారు.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 01st, 09:15 am

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:39 pm

ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.