జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 23rd, 11:00 am
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ దాకా అనే ఈ సంవత్సర ఇతివృత్తం.. భారత చరిత్ర పట్ల విశ్వాసాన్ని.. భవిష్యత్తు పట్ల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. తక్కువ సమయంలోనే జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత యువతకు ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించే సందర్భంగా మారిన తీరును మనం ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి ఇది దేశానికే గర్వకారణం. శాస్త్రవేత్తలు, యువత సహా అంతరిక్ష రంగానికి చెందిన అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటీవల భారత్ అంతర్జాతీయ స్థాయి ఆస్ట్రానమీ – ఆస్ట్రోఫిజిక్స్ ఒలంపియాడ్ నిర్వహించింది. అరవైకి పైగా దేశాల నుంచి దాదాపు 300 మంది యువకులు ఈ ఒలంపియాడ్ పోటీల్లో పాల్గొన్నారు. మన భారతీయ యువత కూడా పలు పతకాలను గెలుచుకున్నారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనం.జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 23rd, 10:30 am
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రసంగించారు. ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ దాకా అనే ఈ సంవత్సర ఇతివృత్తం.. భారత చరిత్ర పట్ల విశ్వాసాన్ని.. భవిష్యత్తు పట్ల సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత యువతకు ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించే సందర్భంగా మారిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. శాస్త్రవేత్తలు, యువత సహా అంతరిక్ష రంగానికి చెందిన అందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రానమీ – ఆస్ట్రోఫిజిక్స్ ఒలంపియాడ్ నిర్వహిస్తోందన్నారు. అరవైకి పైగా దేశాల నుంచి దాదాపు 300 మంది యువకులు ఈ ఒలంపియాడ్‌లో పాల్గొంటున్నారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భారతీయులు పతకాలు గెలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనమన్నారు. యువతలో అంతరిక్షం పట్ల ఆసక్తిని మరింత పెంపొందించడం కోసం ఇండియన్ స్పేస్ హ్యాకథాన్, రోబోటిక్స్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలను ఇస్రో ప్రారంభించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, పోటీల విజేతలనూ ఆయన అభినందించారు.పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
November 26th, 06:07 pm
పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు గాను ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ ప్రక్రియ ల పాలుపంచుకొన్నటువంటి అన్ని కంపెనీల కు కూడా శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.