అందరికీ శాశ్వత పుష్కలత్వం, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థిస్తూ
May 25th, 09:18 am
ప్రకృతి చూపే అపార కృపతోనూ, సూర్య దేవుని శక్తితోనూ, వర్షాలు అందించే పవిత్ర ఆశీస్సులతోనూ మన జీవితాల్లో సుఖ సమృద్ధులు కలుగుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. భూమి సదా చైతన్య పూరితంగా, పచ్చదనంతో కళకళలాడుతూ, సమృద్ధంగా వర్ధిల్లాలని శ్రీ మోదీ నిండు మనసుతో ఆకాంక్షించారు.అందరి శ్రేయస్సు, విశ్వ క్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
May 22nd, 12:08 pm
వికాసం, సమృద్ధి, సమస్త మానవాళి సంక్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ.. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.బాబా విశ్వనాథ్ ఆలయంలో దర్శనం, పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి... దేశ ప్రజలకు సమృద్ధితో పాటు మంచి ఆరోగ్యం దక్కాలని ప్రార్థించిన ప్రధాని
April 29th, 11:45 am
కాశీలో బాబా విశ్వనాథ్ దేవాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దైవ దర్శనం చేసుకొని, పూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దేశ ప్రజలకు సుఖ, సమృద్ధులతో పాటు ఆరోగ్యాన్ని అనుగ్రహించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రార్థించారు.నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
March 19th, 09:48 am
నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని.. 'వికసిత భారత్' సంకల్పం నెరవేరాలని ఆయన ప్రార్థించారు.దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
March 04th, 09:32 am
హోళీ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని, సిరిసంపదలను, విజయాలను తీసుకురావాలని ఆయన కాంక్షించారు.అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి
December 11th, 08:50 pm
అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు.జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన
December 11th, 08:43 pm
మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.ప్రజలకు ధన్‌తేరస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
October 18th, 08:52 am
ధన్‌తేరస్ పండగ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మణిపూర్‌లోని చురచంద్‌పూర్ లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 13th, 12:45 pm
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, రాష్ట్ర ప్రభుత్వ పాలనాధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ కు చెందిన నా సోదరీసోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం!మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
September 13th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ధైర్యం, దృఢ దీక్షకు మణిపూర్ ప్రసిద్ధమని, ఇక్కడి పర్వతాలు ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన అమూల్య కానుకలని అభివర్ణించారు. ప్రజల నిరంతర కృషికి ఇవి ప్రతీకలని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి అభివందనం చేస్తూ- తాను పాల్గొంటున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై కురిపిస్తున్న ప్రేమాదరాలకు ధన్యవాదాలు అర్పించారు.నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
September 13th, 08:57 am
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారత్ దృఢంగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 30th, 08:00 am
ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.ముఖచిత్రం: భారత్ - జపాన్ ఆర్థిక భద్రతా సహకారం
August 29th, 08:12 pm
ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడిన భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాల భద్రత, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అత్యంత కీలకంగా ఉంది. మన వ్యూహాత్మక దృక్పథం, ఆర్థిక అవసరాలలో పెరుగుతున్న సమానత్వం ఆధారంగా ఉన్న మన ద్వైపాక్షిక సహకారానికి ఆర్థిక భద్రతాపరంగా సహకారం ఎంతో కీలకం.15th India-Japan Annual Summit Joint Statement: Partnership for Security and Prosperity of our Next Generation
August 29th, 07:06 pm
PM Modi and Japanese PM Ishiba held the delegation-level talks during which they recalled the longstanding friendship between India and Japan. The two Prime Ministers made a series of announcements focusing on three priority areas: bolstering defense and security cooperation, reinforcing economic partnership and deepening people-to-people exchanges.జీవన, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే తర్వాతి తరం సంస్కరణలపై ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని
August 18th, 08:40 pm
తర్వాతి తరం సంస్కరణలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. జీవన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే, సమ్మిళిత సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన, సమగ్రమైన సంస్కరణలను అందించడమే ఈ సమావేశ లక్ష్యం.భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 07:26 pm
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
August 07th, 03:31 pm
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.పరాగ్వే అధ్యక్షునితో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఆహ్వాన ప్రకటన
June 02nd, 03:00 pm
మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేం చాలా స్నేహపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. దక్షిణ అమెరికాలో పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చు, కానీ మనం ఒకే తరహా ప్రజాస్వామిక విలువలను పంచుకొంటున్నాం. అంతేకాక మన దేశాల ప్రజల అభ్యున్నతి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొంటున్నాం.సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
April 22nd, 08:30 am
యువరాజు, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సౌదీ బయలుదేరి వెళుతున్నాను.