మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

August 16th, 09:02 am

మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. అద్భుతమైన దార్శనికతతో దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

Prime Minister congratulates Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom

July 21st, 08:09 am

Prime Minister Shri Narendra Modi today extended congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి

July 11th, 08:09 am

ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై… భారత ప్రధానమంత్రిగా అత్యధిక కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకుల అభినందనలు

June 09th, 07:32 pm

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, అత్యధిక కాలం భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచ నేతలు హృదయపూర్వకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులు ఆయన పరిణామాత్మక పాలనను, వర్ధమాన దేశాల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. సార్వజనీన, గతిశీల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించడంపై ఆయన దార్శనికతను వారు వేనోళ్ల ప్రశంసించారు.

కెనడా ప్రధాని పర్యటన రెండు దేశాల మధ్య నిజంగా ఓ సరికొత్త భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేసిందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 03rd, 10:16 pm

కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటించడం ఈ రెండు దేశాల మధ్య నిజంగా సరికొత్త భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేసిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు మొదలైన సందర్భంగా ప్రధానమంత్రి వాఖ్యలు

January 29th, 10:15 am

నిన్న, గౌరవ రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, 140 కోట్ల మంది దేశ ప్రజల ఉమ్మడి కృషితో పాటు ఆకాంక్షలకు.. మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు నిర్దిష్ట వ్యాఖ్యానంగా ఉన్నది. ఆ ప్రసంగం చట్టసభల సభ్యులందరికీ మార్గదర్శకం కాగల అనేక ఆలోచనల్ని కూడా ఆవిష్కరించింది. సమావేశాల ఆరంభంలో, అదీనూ 2026 సంవత్సరం మొదలయ్యీ మొదలవక ముందే, గౌరవ రాష్ట్రపతి గారు సభలో పేర్కొన్న విషయాలు చాలా సరళ భాషలో దేశాధినేతగా చెప్పిన మాటలు. ఈ మాటలను పట్టి చూస్తే పార్లమెంటు గౌరవ సభ్యులంతా ఈ మాటల్ని గంభీరంగా లెక్క లోకి తీసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఈ సమావేశాలు ఎంతో కీలకం. బడ్జెట్ సమావేశాలివి.

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 29th, 10:00 am

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది పౌరుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల కఠోర శ్రమను, యువతరం ఆకాంక్షలను ప్రస్ఫుటం చేసిందని వ్యాఖ్యానించారు. సమావేశాల ప్రారంభానికి ఎంతో ముందుగానే... 2026 ఆరంభ సమయాన అనేక మార్గదర్శకాంశాలను రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులందరి ముందుంచారని ఆయన గుర్తుచేశారు. దేశాధినేతగా రాష్ట్రపతి సరళ ప్రసంగంలో వెలిబుచ్చిన ఆకాంక్షలను ఎంపీలందరూ తప్పక పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ సమావేశాలు కీలకమైనవి కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ సమావేశం కావడంతోపాటు 21వ శతాబ్దపు తొలి త్రైమాసికం ముగింపు సహా రెండో త్రైమాసికం ఆరంభాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. దేశం 2047 నాటికి వికసిత భారత్‌ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ బడ్జెట్ ప్రస్తుత శతాబ్దపు రెండో త్రైమాసికంలో మొదటిదని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు.

పూర్వ ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు

December 23rd, 09:39 am

పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతులకు సౌభాగ్యం .. ఈ ఆశయాల సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృత‌జ్ఞులైన దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని శ్రీ మోదీ అన్నారు.

భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి

December 10th, 07:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు.

Prime Minister Congratulates Australian Prime Minister H.E. Mr. Anthony Albanese and Ms. Jodie Haydon on their Wedding

November 29th, 09:05 pm

Prime Minister Shri Narendra Modi today extended his heartfelt congratulations to his good friend, Prime Minister of Australia, H.E. Mr. Anthony Albanese and Ms. Jodie Haydon on the occasion of their wedding.

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ

November 23rd, 09:46 pm

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.

Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025

November 23rd, 09:44 pm

PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.

జోహాన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

November 23rd, 09:41 pm

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇద్దరూ భారత్, కెనడా భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

November 19th, 07:53 am

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

జపాన్ ప్రధానమంత్రి శ్రీమతి హెచ్ఈ సానే తకాయిచీకి ప్రధానమంత్రి అభినందనలు; భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లటంపై చర్చ

October 29th, 01:14 pm

జపాన్ ప్రధానమంత్రి హెచ్ఈ సానే తకాయిచీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.

జపాన్ కొత్త ప్రధాని సానే తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 21st, 11:24 am

జపాన్ ప్రధానమంత్రి పదవికి సానే తాకాయిచీ ఎన్నికైన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ భారత్, జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.

న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 11:09 pm

శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్‌ గారికి, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్‌ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!

న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం

October 17th, 08:00 pm

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.

కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 15th, 02:41 pm

కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా ప్రియ స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి శ్రీ రైలా ఒడింగా మరణ వార్త తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయన ఓ సమున్నత రాజనీతిజ్ఞ‌ుడే కాక భారత్‌కు ఆప్త మిత్రుడు కూడా. గుజరాత్‌కు నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచీ ఆయన నాకు బాగా తెలుసు.. మా అనుబంధం ఏళ్ల తరబడి కొనసాగింది’’ అని శ్రీ మోదీ అన్నారు. భారత్ అన్నా, మన దేశ సంస్కృతి.. మన విలువలు.. మన దేశ ప్రాచీన జ్ఞ‌ానమన్నా శ్రీ రైలా ఒడింగాకు ఎంతో ప్రేమ. ఈ ప్రేమకు నిదర్శనం భారత్-కెన్యా సంబంధాలను బలపరచడానికి ఆయన నడుం బిగించి చేసిన కృషే‘‘ అని శ్రీ మోదీ అన్నారు.

అధ్యక్షుడు శ్రీ ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో పురోగతి...

October 09th, 10:17 pm

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక సజావుగా ముందుకు వెళ్లడంపై శ్రీ నెతన్యాహూకు అభినందనలు తెలిపారు.