యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

July 08th, 01:46 pm

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ప్రదేశం, యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. గౌరవ సూచకంగా ప్రధానమంత్రితో కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు గౌరవ శ్రీ ప్రబోవో సుబియాంటో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ ఆలయ సముదాయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఇరుదేశాల నాయకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta

July 07th, 11:47 pm

Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.

జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి

July 07th, 05:30 pm

ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia

July 07th, 05:15 pm

At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.

ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

July 07th, 03:15 pm

ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.

ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 03:00 pm

ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్‌.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.

ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు

July 07th, 02:51 pm

నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

July 07th, 11:21 am

మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

జకార్తా చేరుకున్న ప్రధాని మోదీ

July 06th, 05:03 pm

ప్రధాని మోదీ ఇండోనేషియాలోని జకార్తా చేరుకున్నారు. ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.

ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

July 06th, 09:00 am

ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్త‌లోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.

ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన

July 03rd, 08:42 pm

ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.

జకార్తాలోని సనాతన ధర్మాలయ మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 02nd, 02:45 pm

గౌరవనీయ అధ్యక్షుడు ప్రబోవో, మురుగన్ ఆలయ ట్రస్టు చైర్మన్ పా హషీం, ధర్మకర్త డాక్టర్ కోబాలన్, ఉన్నతాధికారులు, తమిళనాడు, ఇండోనేషియాకు చెందిన పురోహితులు, ఆచార్యులు, భారత సంతతి ప్రజలు, ఈ పవిత్ర కార్యంలో పాల్గొంటున్న ఇండోనేషియా, ఇతర దేశాల పౌరులు.. దివ్యమైన, మహత్తరమైన ఈ ఆలయాన్ని సాకారం చేసిన ప్రతిభావంతులైన కళాకారులందరికీ శుభాకాంక్షలు!

ఇండోనేషియాలోని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయం మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

February 02nd, 02:30 pm

ఇండోనేషియాలోని జకార్తాలో శ్రీ సనాతన ధర్మాలయం మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, మురుగన్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పా.హషీమ్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కోబాలన్, తమిళనాడు, ఇండోనేషియాకు చెందిన ప్రముఖులు, పూజారులు, ఆచార్యులు, ప్రవాస భారతీయులు, ఇండోనేషియా, ఇతర దేశాలకు చెందిన పౌరులు, ఈ దివ్యమైన, అద్భుతమైన ఆలయాన్ని సాకారం చేసిన ప్రతిభావంతులైన కళాకారులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంపై ఈ వారం ప్రపంచం

January 29th, 12:34 pm

ఈ వారం, భారతదేశం విదేశీ పెట్టుబడులను పెంచడం మరియు అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడం నుండి దాని సాంకేతిక మరియు రక్షణ సామర్థ్యాలను పెంచడం వరకు అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచ రంగంలో భారతదేశం తన పెరుగుతున్న పాత్రను నొక్కి చెబుతూనే ఉంది. ఈ వారం భారతదేశం యొక్క ప్రపంచ మైలురాళ్లను నిశితంగా పరిశీలించండి.

భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది

January 26th, 12:30 pm

కర్తవ్య పథంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ఐక్యత, బలం మరియు వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. సాయుధ దళాల కవాతు బృందాలు క్రమశిక్షణ మరియు శౌర్యాన్ని ప్రదర్శించాయి, ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేశాయి. భారత వైమానిక దళం యొక్క ఉత్కంఠభరితమైన ఫ్లైపాస్ట్ ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకలకు హాజరైన ప్రజలను ప్రధాని కూడా పలకరించారు.

ఇండోనేషియా అధ్యక్షుడి భారత పర్యటన (2025 జనవరి 23-26) సందర్భంగా కుదిరిన ఎంఒయులు, ఒప్పందాలు

January 25th, 08:54 pm

భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఆరోగ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారతదేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి

January 25th, 05:48 pm

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆయనతో భారత - ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక పాత్ర పోషించిందని, బ్రిక్స్ లో ఇండోనేషియా సభ్యత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 25th, 01:00 pm

భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.

PM Modi meets with President of Indonesia

November 19th, 06:09 am

PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.

ఇండోనేశియా అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రీ ప్రబోవోసుబియాంతో ప్రధాన మంత్రి కి ఫోన్ చేశారు; వారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గురించిచర్చించారు

June 20th, 01:07 pm

ఇండోనేశియా అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రీ ప్రబోవో సుబియాంతో టెలిఫోన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న మాట్లాడారు.