అనువాదం: రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యసభలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 05th, 05:35 pm

ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమాధానం

February 05th, 05:00 pm

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమాధానమిచ్చారు. ధన్యవాద తీర్మానానికి మద్దతుగా తన భావాలను సభతో పంచుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రపతి ప్రసంగం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో గడిచిన ఏడాది కాలం అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశం సరైన దిశలో, గొప్ప వేగంతో దేశం ముందుకు సాగుతోందనీ.. సమాజంలోని అన్ని వర్గాల్లో, ప్రతి రంగంలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్రపతి సునిశితంగా, స్పష్టంగా వివరించారని శ్రీ మోదీ అన్నారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకం

January 25th, 09:30 pm

గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 06th, 04:21 pm

భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యస‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 06th, 04:00 pm

పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్‌ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.... ప్రధాని సమాధానం

February 04th, 07:00 pm

గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.

Prime Minister Shri Narendra Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Lok Sabha

February 04th, 06:55 pm

During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.

పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి గారి నేటి ప్రసంగం వికసిత భారత్ దిశగా దేశం పయనిస్తున్న తీరును ప్రతిబింబించిది: ప్రధాని

January 31st, 02:43 pm

పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి గౌరవ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వికసిత భారత్ దిశగా భారత ప్రస్థానంపై సమగ్ర దార్శనికతను ఆమె ప్రసంగం ఆవిష్కరించిందన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం ప్రేరణాత్మకం.. ఎన్నో అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.. మన రాజ్యాంగానికున్న గొప్పదనాన్ని చెప్పడంతో పాటు దేశాన్ని ప్రగతిపథంలో నిలపడానికి పని చేయాలని స్పష్టం చేశారు: ప్రధానమంత్రి

January 25th, 10:09 pm

గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రేరణదాయకంగా ప్రసంగించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారని, మన రాజ్యంగం గొప్పదనాన్ని చాటిచెప్పడంతో పాటు, దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారని ఆయన అన్నారు.

రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 03rd, 12:45 pm

రాష్ట్రపతి స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ చర్చలో పాల్గొన్నాను. గౌరవ రాష్ట్రపతి మాటలు దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సత్యం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచాయి.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్య సభ లో ప్రధాన మంత్రిఇచ్చిన సమాధానం

July 03rd, 12:00 pm

పార్లమెంటు లో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాల ను తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న సమాధానమిచ్చారు.

లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 02nd, 09:58 pm

మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

లోక్ సభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

July 02nd, 04:00 pm

సభనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ ప్రసంగంలో వికసిత్ భారత్ ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రాష్ర్టపతి తన ప్రసంగంలో అనేక కీలక అంశాలు ప్రస్తావించారని చక్కని మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.