జాంబియా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమాకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 20th, 09:50 pm
జాంబియా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.దేశ బలాన్ని ప్రతిబింబిస్తూ వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మరింత సంకల్పంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చిన రాష్ట్రపతి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం: ప్రధానమంత్రి
August 14th, 08:44 pm
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ఆలోచనాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఆత్మకథ భారత ప్రజాస్వామ్యానికి, భారత సమాజానికి ఒక నిధిగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
August 12th, 09:45 am
మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీ ఆత్మకథ 'ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్' విడుదల సందర్భంగా ప్రధాని మోదీ, సమాజానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాలని కోరుతూ, శ్రీ కోవింద్ తన ప్రవర్తన ద్వారా ప్రతి భారతీయుడు గర్వపడగల భారతదేశపు విలువలు, సంప్రదాయాల చిత్రాన్ని ప్రపంచం ముందు ఉంచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవితంలో సత్వరమార్గాల పట్ల యువతను హెచ్చరిస్తూ, సత్వరమార్గం మిమ్మల్ని కుదించివేస్తుంది అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఆత్మకథను ప్రధాని మోదీ విడుదల చేశారు
August 12th, 09:30 am
మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీ ఆత్మకథ, “భారత గణతంత్ర విజయం: నా జీవితం, నా పోరాటాలు” విడుదల సందర్భంగా, సమాజానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాలని కోరుతూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, శ్రీ కోవింద్ తన ప్రవర్తన ద్వారా ప్రతి భారతీయుడు గర్వపడదగిన భారతదేశపు విలువలు, సంప్రదాయాల చిత్రాన్ని ప్రపంచం ముందు ఉంచారని పేర్కొన్నారు. జీవితంలో సత్వరమార్గాల పట్ల యువతను హెచ్చరిస్తూ, సత్వరమార్గం మిమ్మల్ని కుదించివేస్తుంది అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.ఆగస్టు 12న మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఆత్మకథను ప్రధాని విడుదల చేయనున్నారు
August 11th, 01:22 pm
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ రచించిన “ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్” అనే ఆత్మకథను ప్రధాని మోదీ ఆగస్టు 12న ఢిల్లీలో విడుదల చేయనున్నారు. ఈ ఆత్మకథ శ్రీ కోవింద్ యొక్క అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని, ఆయన బాల్యం నుండి విశిష్టమైన ప్రజా జీవితం మరియు చివరికి భారతదేశ 14వ రాష్ట్రపతిగా చేసిన సేవ వరకు ఆయన అనుభవాలు, పోరాటాలు మరియు విజయాలను వివరిస్తూ, అత్యంత వ్యక్తిగతమైన వృత్తాంతాన్ని అందిస్తుంది.అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి టెలిఫోన్ కాల్
August 08th, 10:58 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ జె.డి. వాన్స్ నుంచి టెలిఫోన్ కాల్ అందుకున్నారు.అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని
July 04th, 09:40 pm
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఉన్న శాశ్వతమైన బలాన్ని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ఇరు దేశ ప్రజల అపరిమిత సామర్థ్యాలపై గల నమ్మకం అనే ఉమ్మడి విలువల పునాదిపై ఈ బంధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)
June 25th, 06:05 pm
సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని
June 20th, 08:58 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సదర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించటాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్ గ్రామంలోని గోసాని పీఠంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
June 20th, 08:54 pm
పహాడ్‌పూర్ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పూజలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.పహాడ్‌పూర్‌లో ఉన్న సంతాలీ జహేరా, హో జహేరాను పూజించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
June 20th, 08:51 pm
పహాడ్‌పూర్ గ్రామంలో ఉన్న సంతాలీ జహేరా, హో జహేరాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు.పహాడ్‌పూర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి
June 20th, 08:47 pm
పహాడ్‌పూర్‌లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము, దివంగత శ్రీ లఖన్ ముర్ము, దివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు జరుగుతున్న కృషిని కొనియాడిన ప్రధానమంత్రి
June 20th, 08:44 pm
పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి
June 15th, 11:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవనంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యారు.ఇటలీ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి భేటీ
May 20th, 07:19 pm
రోమ్‌లోని అధ్యక్ష భవనం క్విరినాలేలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.రాజ్యసభకు శ్రీ హరివంశ్… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 10th, 02:20 pm
శ్రీ హరివంశ్ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.సోషలిస్టు రిపబ్లిక్ వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా శ్రీ తో లామ్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
April 07th, 12:32 pm
కొత్త అధ్యక్షుని నాయకత్వంపై ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన భారత్, వియత్నాంల మైత్రి రాబోయే కాలంలో మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారు. రెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలా, సమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని శ్రీ మోదీ తెలిపారు.పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి జరిగిన అవమానాన్నీ, సంతాల్ సంస్కృతి పట్ల అగౌరవాన్నీ ఖండించిన ప్రధాని
March 07th, 08:14 pm
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిన తీరునూ, సంతాల్ సంస్కృతి పట్ల ఆ ప్రభుత్వ చిన్నచూపునూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
February 24th, 03:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.భారత్‌లో స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ పర్యటన
February 18th, 05:08 pm
స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 18,19 న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’లో ఆయన పాల్గొంటున్నారు. 2024 అక్టోబర్ 27, 29 ద్వైపాక్షిక పర్యటన తర్వాత ఆయనకు ఇది రెండో అధికారిక భారత పర్యటన. ఆయనతో పాటు స్పెయిన్ డిజిటల్ పరివర్తన, పౌర సేవల మంత్రి శ్రీ ఆస్కార్ లోపెజ్ అగ్యుడా, వ్యవసాయ, మత్స్య, ఆహార శాఖ మంత్రి శ్రీ లూయిస్ ప్లానాస్ పుచాడెస్ కూడా ఉన్నారు.