ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 54 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత ప్రీతి పవార్కు ప్రధానమంత్రి అభినందన

October 03rd, 11:23 pm

ఆసియా క్రీడ‌ల‌ మ‌హిళ‌ల బాక్సింగ్‌ 54 కిలోల విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన భారత బాక్స‌ర్ ప్రీతి ప‌వార్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ 19 ఏళ్ల యువతి ప్రతిభను చూసి గర్విస్తున్నానని, తానెంచుకున్న క్రీడలో అంకితభావం, నిలకడ, మొక్కవోని దీక్షకు ఆమె సాధించిన ఈ విజయం సంకేతమని ఆయన ప్రశంసించారు.