ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలు... రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
June 27th, 05:06 pm
ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలను రేపు.. అంటే ఈ నెల 28న.. ఉదయం దాదాపు 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి నివాళులు
April 10th, 08:44 am
మహావీర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భగవాన్ మహావీర్ సదా అహింసకూ, సత్యానికీ, కరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీ, ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీ, ఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం
October 03rd, 09:38 pm
మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. భారతదేశం లోతైన, ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన భాషలు సంరక్షణగా ఉండడంతో పాటు వివిధ సామజిక చారిత్రక, సాంస్కృతిక విజయాల సారాన్ని ప్రతిబింబిస్తాయి.