డిసెంబరు 7న ప్రధానమంత్రి గోరఖ్‌పూర్‌ సందర్శన; రూ.9600 కోట్ల విలువైన వివిధ పథకాలు జాతికి అంకితం

December 03rd, 08:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబరు 7న గోరఖ్‌పూర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రూ.9600 కోట్ల విలువైన వివిధ పథకాలను జాతికి అంకితం చేస్తారు. ఇందులో భాగంగా 2016 జూలై 22న తన చేతులమీదుగా శంకుస్థాపన చేసిన గోరఖ్‌పూర్‌ ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇప్పటికి 30 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న ఈ కర్మాగారం పునరుద్ధరణ ప్రక్రియ కింద రూ.8,600 కోట్ల వ్యయంతో తిరిగి నిర్మించబడింది. యూరియా ఉత్పత్తిలో స్వావలంబనపై ప్రధాని దార్శనికత స్ఫూర్తే ఈ ఎరువుల కర్మాగారం పునరుజ్జీవనానికి తోడ్పడింది. గోరఖ్‌పూర్‌ కర్మాగారంలో ఏటా 12.7 లక్షల టన్నుల దేశీయ వేపపూత యూరియా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ముఖ్యంగా పూర్వాంచల్ సహా పరిసర ప్రాంతాల రైతుల యూరియా అవసరాలు తీరడం ద్వారా వారికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సర్వతోముఖ ఆర్థిక వృద్ధికి ఇది ఉత్తేజమిస్తుంది.