ఢిల్లీలో వీరబాల దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
December 26th, 01:30 pm
దేశానికి గర్వకారణమైన వీర సాహిబ్‌జాదాలను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం. అజేయమైన భారత ధైర్యసాహసాలకు, వీరత్వానికి వారు ప్రతీకలు. వయస్సు, పరిస్థితుల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న, స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ దేశ యువత సాధించలేనిదంటూ ఏమీలేదు.న్యూఢిల్లీలో వీరబాల దివస్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 26th, 01:00 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి, అక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారు. వీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
December 25th, 05:37 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు నిర్వహిస్తున్న 'వీర్ బాల్ దివస్' జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.ఢిల్లీలో వీర బాల దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
December 25th, 01:58 pm
దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాన మంత్రి సంభాషణ
January 23rd, 06:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బిపి) అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ప్రధాన మంత్రి ప్రతి అవార్డు గ్రహీతకు స్మారక చిహ్నాలను అందించి, ఆపై వారితో ఫ్రీవీలింగ్ ఇంటరాక్షన్- ఇష్టాగోష్ఠిలో నిమగ్నమయ్యారు. అవార్డుకు ఎంపికైనందుకు పిల్లలు తమ విజయాల వివరాలను పంచుకున్నారు. సంగీతం, సంస్కృతి, సౌరశక్తి, బ్యాడ్మింటన్, చెస్ వంటి వివిధ విషయాలపై చర్చించారు.‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం’ విజేతలకు ప్రధాని ప్రశంసలు
January 24th, 09:49 pm
ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం విజేతలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. “ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం” సంబంధిత విభాగాల్లో విశిష్ట విజయాలు సాధించిన బాలలకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్” ((పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. ఈ మేరకు ‘పీఎంఆర్‌బీపీ-2023’కుగాను బాలశక్తి పురస్కార్‌లోని వివిధ కేటగిరీల కింద దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 11 మంది బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలున్నారు.ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ
January 24th, 07:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో సంభాషించారు.ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ విజేతల తో జనవరి 24 వ తేదీ న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
January 23rd, 03:00 pm
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్ బిపి) విజేతల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 24 వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల వేళ లో తన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో సమావేశం కానున్నారు.