మత్స్య రంగ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద కింద కేంద్ర ప్రభుత్వ ఉప పథకం "ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్-యోజన (పిఎం-ఎం కె ఎస్ ఎస్ వై )" కు క్యాబినెట్ ఆమోదం: వచ్చే నాలుగేళ్లలో ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి

February 08th, 08:58 pm

మత్స్య రంగ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద కింద కేంద్ర ప్రభుత్వ ఉప పథకం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్-యోజన (పిఎం-ఎం కె ఎస్ ఎస్ వై ) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో అంటే 2023-2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లో ఈ పథకం పై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తారు.