నవంబరు 1న ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

October 31st, 12:02 pm

ఉదయం సుమారు 10 గంటల వేళకు, ఆయన ‘దిల్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా 2500 మంది చిన్నారులతో భేటీ అవుతారు. వారందరికీ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బును చికిత్స చేసిన నేపథ్యంలో, నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో ‘జీవన దానం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డెహ్రాడూన్‌లో ప్రధాని పర్యటన.. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం అంచనాపై సమీక్ష సమావేశం

September 11th, 06:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్‌ను సందర్శించి.. ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.

జులై 18న... బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన

July 17th, 11:04 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

బీహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబంధిత కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం‌

April 24th, 12:00 pm

నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు, మీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరే, మీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండే, ఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచే, కొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూ, మొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. ఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా బీహార్లోని మధుబనిలో

April 24th, 11:50 am

ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో కొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.13,480 కోట్లు. పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన వారిని ప్రధాని కోరారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశమంతా మిథిల, బీహార్‌తో అనుసంధామైందని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్, రైల్వేలు, వసతుల ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఇవి బీహార్లో నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. ప్రముఖ కవి రాంధారి సింగ్ దినకర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

ఏప్రిల్ 24న ప్రధానమంత్రి బీహార్ పర్యటన

April 23rd, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (ఏప్రిల్ 24 న) బీహార్ లో పర్యటిస్తారు. ఉదయం మధుబని చేరుకుని, 11.45 ని. లకు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ. 13,480 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. అనంతరం శ్రీ మోదీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన

March 28th, 02:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్‌ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.

బడ్జెట్ అనంతర వెబినార్‌లో వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 01:00 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 12:30 pm

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.

భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 04th, 11:15 am

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,

PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025

January 04th, 10:59 am

PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.

Prime Minister Narendra Modi to visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh

March 08th, 04:12 pm

Prime Minister will visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh on 8th-10th March, 2024

Today, every effort being made in New India is creating a legacy for the future generations: PM Modi

February 22nd, 02:00 pm

Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,500 crores in Tarabh, Mahesana, Gujarat. The projects encompass a wide range of sectors such as internet connectivity, rail, road, education, health, connectivity, research and tourism. Addressing the gathering, the Prime Minister underscored the importance of the present moment in the development journey of India as both the ‘Dev Kaaj’ (pine works) and ‘Desh kaaj’ (national tasks) are going on at a rapid pace.

గుజరాత్ లోని మహెసాణా లో గల తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధిప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటు, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 22nd, 01:22 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మహెసాణా లో తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టు లు ఇంటెర్ నెట్ కనెక్టివిటీ, రైలు మార్గాలు, రహదారాలు, విద్య, ఆరోగ్యం, కనెక్టివిటీ, పరిశోధన మరియు పర్యటన ల వంటి వివిధ రంగాల కు చెందినవి.

Our government is actively working to ensure a secure roof over every poor person's head: PM Modi

February 10th, 01:40 pm

Prime Minister Narendra Modi addressed ‘Viksit Bharat Viksit Gujarat’ program via video conferencing. During the programme, the Prime Minister inaugurated and performed Bhoomi Poojan of more than 1.3 lakh houses across Gujarat built under Pradhan Mantri Awas Yojana (PMAY) and other housing schemes. He also interacted with the beneficiaries of Awas Yojna. Addressing the gathering, the Prime Minister expressed happiness that people from every part of Gujarat are connected with the development journey of Gujarat.

‘‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 10th, 01:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని విభిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై), ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించతలపెట్టిన, పూర్తయిన 1.3 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.

People’s faith and trust in government is visible everywhere: PM Modi

January 18th, 12:47 pm

Prime Minister Narendra Modi interacted with the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra. Addressing the programme, PM Modi said that the initiative has become a 'Jan Andolan' as scores of people are benefitting from it. He termed the programme as the best medium for last-mile delivery of government schemes.

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 18th, 12:46 pm

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రెండు నెలలు పూర్తిచేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ యాత్ర కు సంబంధించిన వికాస్ రథ్ , విశ్వాస్ రథ్ గా మారిందని, అర్హులైన ఏ ఒక్కరికీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండదన్న విశ్వాసం బలపడిందన్నారు.లబ్ధిదారులలో పెద్ద ఎత్తున ఉత్సాహం , ఆసక్తి వ్యక్తమవుతోందని, అందువల్ల వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను జనవవరి 26 అనంతరం కూడా కొనసాగించాలని, ఫిబ్రవరిలో కూడా దీనిని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నవంబర్ 15 వ తేదీన, భగవాన్ బిర్సా ముండా ఆశీస్సులతో ప్రారంభమైందని ,ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ యాత్రలో ఇప్పటివరకు 15 కోట్ల మంది పాల్గొన్నారని, దేశంలోని 80 శాతం పంచాయతీలను ఈ యాత్ర పూర్తి చేసిందని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశం, ఏదో ఒక కారణంతో ప్రభుత్వ పథకాలకు దూరమైన వారిని చేరుకోవడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతిఒక్కరిచేతా నిరాదరణకు గురైన వారిని మొదీ ఆరాధిస్తారని, వారికి విలువ ఇస్తారని ప్రధానమంత్రి అన్నారు.

పీఎం - జన్ మన్ కింద పీఎంఏవై (జి) 1 లక్ష మంది లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

January 14th, 01:22 pm

ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్ మన్) కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ ( పీఎంఏవై-జి) కి సంబందించిన 1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదటి విడతను విడుదల చేయనున్నారు. . ఈ సందర్భంగా ప్రధానమంత్రి పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు.