80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం
August 15th, 06:50 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది
August 15th, 06:45 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శక్తి, సంకల్పంతో 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే కల గురించి మాట్లాడారు. శాంతి చట్టం, రైల్వే విద్యుదీకరణ, భారతదేశ వాణిజ్య ఒప్పందాలు, నక్సలిజం అంతం వంటి కీలకమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'శక్తి కీ సప్తధార'ను స్వీకరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.న్యూఢిల్లీలో నిర్వహించిన ‘రిపబ్లిక్ సమ్మిట్-2026’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 22nd, 10:24 pm
రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 22nd, 08:00 pm
రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 11:41 pm
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
June 18th, 09:30 pm
ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.గరీబ్ కళ్యాణ్, ప్రజల సాధికారతే ధ్యేయంగా12 ఏళ్ల విప్లవాత్మక కార్యక్రమాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి
June 08th, 10:24 am
గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులన్నింటికీ మూలాధారమని స్పష్టం చేశారు. అంత్యోదయ ఆశయంతో మన ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందని, దశాబ్దాలుగా వెనకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ ప్రయత్నమని ప్రధానమంత్రి తెలిపారు.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 28th, 05:30 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులోని నా సహచరులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, యూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారు, జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ సోదరి పూనం మౌర్య గారు, వేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన నా తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు అందరికీ నమస్కారం.వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 28th, 05:00 pm
ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.టీఎంసీ కేవలం దూషిస్తుంది, బెదిరిస్తుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుంది: పశ్చిమ బెంగాల్‌లోని బ్యారక్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 27th, 12:00 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగపూరిత ప్రసంగంతో జనసమూహంలో ఉత్సాహాన్ని నింపారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలిపారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం బ్యారక్‌పూర్‌ను ఉత్తేజపరిచింది
April 27th, 11:30 am
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన ప్రసంగంతో జనసమూహాన్ని ఉత్తేజపరిచారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలబెట్టారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.టీఎంసీ ప్రభుత్వాన్ని గూండాలు నడుపుతున్నారు లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే నడుపుతున్నారు: పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో ప్రధాని మోదీ
April 26th, 01:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో జరిగిన విజయ సంకల్ప్ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 15 ఏళ్ల బెదిరింపుల తర్వాత బెంగాల్ ప్రజలు ఇప్పుడు అన్యాయాన్ని ఓడించడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కోర్టు జోక్యం తర్వాత మాత్రమే టీఎంసీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. భయం, అవినీతి, సిండికేట్ నియంత్రణ లేని ప్రభుత్వం మాత్రమే బెంగాల్ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయగలదని పేర్కొంటూ, ప్రజలు బీజేపీకి నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ 15 ఏళ్ల సిండికేట్ టీఎంసీ పాలనకు మే 4తో ముగింపు: పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లో ప్రధాని మోదీ
April 26th, 01:30 pm
పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, టీఎంసీ అవినీతి, సిండికేట్ పాలన, భయ రాజకీయాలపై తీవ్ర సందేశం ఇచ్చారు. టీఎంసీ పాలనలో నారీ శక్తి అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని పేర్కొంటూ, మార్పుకు నాయకత్వం వహించాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను కూడా ఆయన వివరించి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని గుర్తుచేసుకున్నారు.పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్, ఆరాంబాగ్‌లలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన ర్యాలీలు
April 26th, 01:24 pm
పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, టీఎంసీ అవినీతి, సిండికేట్ రాజ్, భయ రాజకీయాలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇస్తూ, బంగావ్, ఆరాంబాగ్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.టీఎంసీ అండతో తలదాచుకున్న నేరస్తులకు శిక్ష తప్పదు: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 24th, 11:45 am
పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ మొదటి దశ పోలింగ్‌లో ప్రజల భారీ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. మొదటి దశలో టీఎంసీ (TMC) కనీసం ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు; అలాగే, అభివృద్ధి చెందిన బెంగాల్ కోసం బీజేపీకి నిర్ణయాత్మక తీర్పునివ్వాలని రెండో దశ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాదవ్‌పూర్ యూనివర్సిటీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, ప్రజలను ప్రభావితం చేస్తున్న స్థానిక సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.