సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 28th, 10:25 am

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim

April 28th, 10:15 am

Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.

ఏప్రిల్ 27–28 తేదీల్లో సిక్కింలో ప్రధాని పర్యటన

April 26th, 03:47 pm

2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన గ్యాంగ్‌టక్ చేరుకుంటారు. ఏప్రిల్ 28న ఉదయం దాదాపు 9:30 గంటలకు గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. సిక్కిం రాష్ట్ర పర్యావరణ, పుష్ప వైభవాన్ని చాటేలా.. అత్యాధునిక, ప్రపంచ స్థాయి ఆర్కిడ్ అనుభూతి కేంద్రంగా స్వర్ణజయంతి మైత్రీ మంజరి పార్కును అభివృద్ధి చేశారు.

మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన

March 30th, 11:05 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

అహ్మదాబాద్‌లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్‌’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 12th, 01:35 pm

భారత్‌-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్‌ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.

ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ 50వ సమావేశం

December 31st, 08:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- ముందస్తు చర్యలతో కూడిన పాలన, సకాలంలో అమలు) ఐసీటీ-ఆధారిత బహుముఖ వేదిక 50వ సమావేశం జరిగింది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా సహకార, ఫలితాల ఆధారిత పాలనలో ‘ప్రగతి’ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతికతతో కూడిన నాయకత్వం, తక్షణ పర్యవేక్షణ, కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేశాయో ఈ సమావేశం స్పష్టం చేసింది.

డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 01:00 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 09th, 12:30 pm

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 22nd, 11:36 am

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 22nd, 11:00 am

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.

ఆగస్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని

August 20th, 03:02 pm

ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి

April 12th, 04:48 pm

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

న్యూఢిల్లీలో సోల్‌ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 21st, 11:30 am

భూటాన్ ప్రధానమంత్రి, నా సోదరుడు దషో షెరింగ్ టోబ్‌గే, సోల్ (స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌) బోర్డు చైర్మన్ సుధీర్ మెహతా, వైస్ చైర్మన్ హన్స్ముఖ్ అధియా, జీవితాల్లో, ఆయా రంగాల్లో నాయకత్వాన్ని అందించడంలో విజయం సాధించిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ఇంకా ఇక్కడ నేను చూస్తున్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే భవిష్యత్తు ఎదురుచూస్తున్న నా ఇతర యువ సహచరులారా…

సోల్ నాయకత్వ సదస్సు మొదటి సంచికను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 21st, 11:00 am

స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సు-2025 మొదటి సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు, భవిష్యత్తులో నాయకులుగా ఎదగబోతున్న యువతకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. కొన్ని కార్యక్రమాలు మనసుకు దగ్గరగా ఉంటాయని ఈ రోజు జరుగుతున్న సదస్సు కూడా అలాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశ నిర్మాణానికి మెరుగైన పౌరులను తయారు చేయడం, ప్రతి రంగంలోనూ అద్భుతమైన నాయకులను తీర్చిదిద్దడం అవసరం’’ అని ప్రధాని అన్నారు. ప్రతి రంగంలోనూ గొప్ప నాయకులను తయారుచేయడం ప్రస్తుతం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ దిశగా సాగుతున్న వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్‌ను ఓ ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఈ సంస్థ పేరుకి తగినట్టుగానే తనలో భారతీయ సామాజిక జీవన ఆత్మను నిలుపుకొని, దానిని కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని సోల్ అందంగా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. సోల్ సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థకు భవిష్యత్తులో గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో విస్తృతమైన క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 10:45 am

గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!

సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 28th, 10:30 am

గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.

PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir

September 19th, 12:00 pm

PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.

మరింత వాతావరణ అనుకూలమైన, వాతావరణ-స్మార్ట్ భారత్‌ను రూపొందించడానికి 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం

September 11th, 08:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.