న్యూఢిల్లీలో నిర్వహించిన ‘రిపబ్లిక్ సమ్మిట్-2026’లో ప్రధానమంత్రి ప్రసంగం
June 22nd, 10:24 pm
స్వర సాధన.. మనోకామన.. ఆరాధన- ఇలాంటి శుభారంభం తర్వాత, మీ కార్యక్రమమే కొనసాగి ఉంటే చాలా బాగుండేదేమో... ఏదేమైనా మీకందరికీ నమస్కారం!‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 22nd, 08:00 pm
రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 22nd, 02:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
July 12th, 11:30 am
కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 12th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 18th, 01:15 pm
బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయం రూపుదాల్చడం మన దేశం యొక్క నూతన ఆవిష్కరణ లు మరియు ప్రగతి కి నిదర్శన గా ఉందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.