Fulfilling public aspirations is the core objective of this budget and the resolution of this government: PM Modi

March 09th, 10:30 am

PM Modi addressed the post-budget webinars today, focusing on the theme “Sabka Saath Sabka Vikas-Fulfilling Aspirations of People”. In his remarks, the PM highlighted India’s prowess in the past decade in health, education, sports and tourism. He emphasised the importance of synergy between various stakeholders to accelerate national progress and solidify the foundation of a Viksit Bharat.

‘‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’’ - అనే అంశంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 09th, 10:15 am

బడ్జెట్ అనంతర వెబినార్లలో భాగంగా ‘‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’’ అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన నాలుగో వెబినార్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో విద్య, నైపుణ్యం, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి లాంటి రంగాలు ప్రధాన వాహనాలుగా పనిచేస్తాయని శ్రీ మోదీ వివరించారు. బడ్జెట్ ప్రకటనలను సమర్థంగా అమలు చేయడంపై చర్చిస్తున్న నిపుణులు, విధాన రూపకర్తలకు స్వాగతం పలికారు. ‘‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ఒక అంశానికి మాత్రమే పరిమితం కాదు. అది ఈ బడ్జెట్‌లో ప్రధాన లక్ష్యం, ప్రభుత్వ సంకల్పం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మార్చి 9వ తేదీన ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ అనే అంశంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

March 08th, 04:35 pm

2026 మార్చి 9న ఉదయం 10:15 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ ఇతివృత్తంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 06th, 01:14 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న మూడో వెబినార్‌కు మీ అందర్నీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తొలి రెండు వెబినార్లలో సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి వంటి కీలకాంశాలపై మనం సమీక్షించాం. ఇక నేటి వెబినార్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ-వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై చర్చ కేంద్రీకృతమైంది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో మీరంతా విలువైన సూచనలతో ఎంతగానో తోడ్పడ్డారు. మీరిచ్చిన సూచనలు, సలహాలు బడ్జెట్‌లో ప్రతిబింబించడంతో అవెంతో ఉపయుక్తమయ్యాని కూడా మీరు గమనించి ఉంటారు. అయితే, బడ్జెట్ సమర్పణ అనంతరం దేశం దాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు మీ అనుభవం, సూచనలతో ప్రజలకు అత్యధికంగా బడ్జెట్ ప్రయోజనాలు అందేవిధంగా సరళ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను పూర్తి స్థాయిలో సకాలంలో వినియోగించడంపై ఈ వెబినార్‌ సందర్భంగా మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది.

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశాలపై పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 06th, 01:00 pm

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై పోస్ట్ బడ్జెట్ మూడో వెబినార్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధిపై గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములందరూ ఎంతో సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్ అనంతరం, దేశ సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి ప్రయోజనాలను పొందటం ముఖ్యం. ఈ దిశగా మీ సూచనలు, ఈ వెబినార్ ఎంతో కీలకమైనవి అని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మార్చి 6న ‘వ్యవసాయం, గ్రామీణ పరివర్తన’ అంశంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

March 05th, 06:04 pm

2026 మార్చి 6వ తేదీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ‘వ్యవసాయం, గ్రామీణ పరివర్తన’ అనే అంశంపై నిర్వహించే ‘బడ్జెట్ అనంతర వెబినార్‌’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో సుస్థిర, బలమైన ఆర్థిక వృద్ధిపై పీఎం ప్రసంగం

March 03rd, 11:30 am

బడ్జెట్ వెబినార్ సిరీస్‌లో భాగంగా గత వారం మొదటి వెబినార్ జరిగింది. అది విజయవంతమైందని నాకు తెలిసింది. బడ్జెట్ నిబంధనల అమలుపై ప్రతి ఒక్కరూ అద్భుతమైన సూచనలు ఇచ్చారు. మీ అందరి క్రీయాశీలక భాగస్వామ్యాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇవాళ రెండో వెబినార్ జరుగుతుంది. ఇవాళ కూడా విస్తృత శ్రేణి అంశాలపై వేలాది మంది లెక్కలేనన్ని సూచనలు ఇస్తారని, వివిధ రంగాల నిపుణులు కూడా మనతో పాల్గొంటారని నాకు సమాచారం ఉంది. బడ్జెట్ పై ఇంతటి భారీ స్థాయి చర్చ నిర్వహించటం విజయవంతమైన ప్రయోగం. ఈ వెబినార్‌లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరం బలోపేతం చేయటమే ఈ వెబినార్ ఇతివృత్తం. పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికే ఆశా కిరణంలా భారత్ మారిన తరుణంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తున్న వేళ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి వేగవంతమైన ఆర్థిక పురోగతే ప్రధాన ఆధారం. మన లక్ష్యం, మన సంకల్పం స్పష్టంగా ఉన్నాయి. నిర్మాణ సామర్థ్యం, ఉత్పత్తి, అనుసంధానతను పెంచటంతో పాటు ఎగుమతులను కూడా మరింతగా పెంచాల్సిన అవసముంది. ఇవాళ మీరు చేస్తున్న ఈ మేధోమదనం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.

‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం’పై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 03rd, 11:15 am

‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేసుకోవడం’ అంశంపై ఈ రోజు నిర్వహించిన బడ్జెట్ అనంతర రెండో వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత వారం ఉత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ.. మొదటి వెబినార్ విజయవంతమైందని, బడ్జెటులో పేర్కొన్న అంశాల అమలుపై అద్భుతమైన సూచనలు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“ఆర్థిక వృద్ధి బలోపేతం.. స్థిరత్వం” ఇతివృత్తంగా మార్చి 3న నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 02nd, 07:10 pm

“ఆర్థిక వృద్ధి బలోపేతం.. స్థిరత్వం” ఇతివృత్తంగా మార్చి 3న నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు.

“వికసిత భారత్ కోసం సాంకేతికత.. సంస్కరణలు.. ఆర్థికం” అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

February 27th, 01:01 pm

ఈ ఏడాది తొలి బడ్జెట్ వెబినార్‌లో పాల్గొంటున్న మీకందరికీ స్వాగతం. బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఇలా వెబినార్‌ నిర్వహించడం కొన్నేళ్ల నుంచీ ఓ బలమైన ఆనవాయితీగా మారింది. సాధారణంగా వేర్వేరు పారామితుల ప్రాతిపదికన బడ్జెట్‌ అంచనాలు రూపొందుతాయి. కొన్ని సందర్భాల్లో స్టాక్ మార్కెట్ లావాదేవీలపై చర్చ సాగుతుంది. మరి కొన్నిసార్లు ఆదాయపు పన్ను ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వస్తాయి. వాస్తవానికి జాతీయ బడ్జెట్‌ అంటే- ఓ స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదు… ఇదొక విధానపరమైన భవిష్యత్‌ ప్రణాళిక. కాబట్టి, బడ్జెట్ ప్రభావంపై అంచనాలు కూడా నిర్దిష్ట పారామితులు, విధానాల ఆధారంగా వేయాల్సి ఉంటుంది. ఆ విధానాలు మౌలిక సదుపాయాల విస్తరణ, రుణ ప్రవాహ సౌలభ్యం, వాణిజ్య సౌలభ్య కల్పన, పాలనలో పారదర్శకత పెంపు, జన జీవన నాణ్యత మెరుగుదల, కొత్త అవకాశాలను సృష్టించడం వంటివిగా ఉంటాయి. బడ్జెట్‌లో సంబంధిత నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు శాశ్వత శక్తినిస్తాయి… అయితే, ఏ బడ్జెట్‌నైనా విడిగా లేదా స్వతంత్రమైనదిగా పరిగణించే వీలుండదు.

‘వికసిత భారత్ దిశగా సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సహకారం’పై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

February 27th, 11:30 am

‘వికసిత భారత్ దిశగా సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సహకారం’ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ నిర్వహించిన 2026-27 సిరీస్ మొదటి బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. దేశ బడ్జెట్ అంటే స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదని, అది విధానపరమైన ప్రణాళిక అని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారం చేసుకునే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

"వికసిత్ భారత్ కోసం సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక సాయం" అంశంపై ఫిబ్రవరి 27న పోస్ట్‌ బడ్జెట్ వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న పీఎం

February 26th, 08:07 pm

వికసిత్ భారత్ కోసం సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక సాయం అంశంపై ఫిబ్రవరి 27న ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోస్ట్‌ బడ్జెట్ వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఈ వెబినార్‌లో పబ్లిక్ క్యాపెక్స్, మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, ఆర్థిక రంగ నిర్మాణం, మూలధన మార్కెట్ల విస్తృతి, పన్ను సంస్కరణల ద్వారా జీవన సౌలభ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి.

The vision of Investment in People stands on three pillars – Education, Skill and Healthcare: PM Modi

March 05th, 01:35 pm

PM Modi participated in the Post-Budget Webinar on Employment and addressed the gathering on the theme Investing in People, Economy, and Innovation. PM remarked that India's education system is undergoing a significant transformation after several decades. He announced that over one crore manuscripts will be digitized under Gyan Bharatam Mission. He noted that India, now a $3.8 trillion economy will soon become a $5 trillion economy. PM highlighted the ‘Jan-Bhagidari’ model for better implementation of the schemes.

PM Modi addresses the Post-Budget Webinar on boosting job creation- Investing in People, Economy, and Innovation

March 05th, 01:30 pm

PM Modi participated in the Post-Budget Webinar on Employment and addressed the gathering on the theme Investing in People, Economy, and Innovation. PM remarked that India's education system is undergoing a significant transformation after several decades. He announced that over one crore manuscripts will be digitized under Gyan Bharatam Mission. He noted that India, now a $3.8 trillion economy will soon become a $5 trillion economy. PM highlighted the ‘Jan-Bhagidari’ model for better implementation of the schemes.

రేపు (మార్చి 5) ‘ఉద్యోగాలు’ అన్న అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొననున్న ప్రధాని

March 04th, 05:09 pm

ఉద్యోగాల అంశంపై బుధవారం మార్చి 5న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో జరిగే బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల్లో పెట్టుబడులు ఈ వెబినార్ లో కీలక ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా సమావేశాన్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది.

రేపు (మార్చి 4) మూడు బడ్జెట్ అనంతర వెబినార్లలో పాల్గొననున్న ప్రధానమంత్రి

March 03rd, 09:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 4) మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు బడ్జెట్ అనంతర (పోస్ట్ బడ్జెట్) వెబినార్లలో పాల్గొంటారు. వృద్ధికి చోదకశక్తిగా ఎంఎస్ఎంఇ; తయారీ, ఎగుమతులు, అణుశక్తి మిషన్లు; నియంత్రణ, పెట్టుబడులు, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన సంస్కరణలపై ఈ వెబినార్లు జరుగుతాయి. ఈ సందర్భంగా హాజరైన వారి నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

బడ్జెట్ అనంతర వెబినార్‌లో వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 01:00 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 12:30 pm

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.

మార్చి 1న జరిగే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్లో పాల్గొనున్న ప్రధాని

February 28th, 07:32 pm

మార్చి 1, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమయ్యే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అనే అంశంపై బడ్జెట్ అనంతరం నిర్వహించే వెబినార్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.