పరమ పవిత్రులు పోప్ లియో XIVకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 09th, 02:21 pm

పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల పక్షాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలిపారు. కేథలిక్ చర్చికి పోప్ అందిస్తున్న నాయకత్వాన్ని శ్రీ మోదీ హర్షించారు. ప్రపంచంలో శాంతినీ, సద్భావననూ, సంఘీభావాన్నీ, సేవనూ వ్యాప్తి చేయడంలో కేథలిక్ చర్చికి విస్తృత ప్రాధాన్యం ఉందని ప్రధాని అన్నారు.