గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నర్మద జిల్లాలో ఈ నెల 15న ప్రధానమంత్రి పర్యటన
November 14th, 11:41 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 15న గుజరాత్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో నర్మద జిల్లాలోని దేవ్‌మోగ్రా ఆలయంలో దైవదర్శనం, పూజలు చేస్తారు. ఆ తర్వాత 2:45 గంటలకు దేడియాపడను సందర్శించి, ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలలో పాల్గొంటారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పన సహా ₹9,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.త్రిపురలో ఉదయ్ పూర్ లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధానమంత్రి
September 22nd, 09:41 pm
త్రిపురలోని ఉదయ్ పూర్ లో మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. భారతీయులంతా ఆరోగ్యంగానూ, సుభిక్షంగానూ ఉండాలని కోరుకున్నాను అని శ్రీ మోదీ తెలిపారు.ఏప్రిల్ 11న ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
April 09th, 09:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 11న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. వారణాసిలో ప్రధాని... ఉదయం 11 గంటలకు రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.మార్చి 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
March 05th, 11:18 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ముఖ్‌వాలో గంగా నదిని సందర్శించే స్థలం వద్ద ఆయన ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు దర్శనం, పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాదాపు 10 గంటల 40 నిమిషాలకు మోటార్ సైకిళ్లపై చేసే సాహస యాత్రను ప్రధాని ప్రారంభిస్తారు. హర్సిల్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
March 05th, 11:44 am
తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న ప్రధానమంత్రి
February 25th, 01:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
February 25th, 12:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.గుజరాత్ లోని మహెసాణాలో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
February 22nd, 07:48 pm
గుజరాత్ లోని మహెసాణా లో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించడం తో పాటు గా, అక్కడ జరిగిన పూజ కార్యక్రమం లో కూడా పాలుపంచుకొన్నారు.ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన
February 21st, 11:41 am
ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.అయోధ్యలోని కొత్తగా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిరంలో జనవరి 22 వ తేదీన శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
January 21st, 09:04 pm
ఈ చారిత్రకమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని ఆధ్యాత్మిక, మత వర్గాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే అన్ని వర్గాల, గిరిజన వర్గాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తారు.ధనుష్కోడిలోని కోదండరామ దేవాలయంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
January 21st, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధనుష్కోడిలోని కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పూర్తిగా కోదండరామస్వామికే అంకితం అయింది. కోదండరామ అంటే విల్లు పట్టుకున్న రాముడు. ధనుష్కోడి అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు తొలి సారి శ్రీరాముని కలిసి శరణు కోరిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. విభీషణునికి శ్రీరాములవారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది అని కొందరు చెబుతారు.తమిళ నాడు లోని అరుళ్ మిగురామనాథస్వామి దేవాలయం లో ప్రార్థించిన ప్రధాన మంత్రి
January 20th, 07:48 pm
తమిళ నాడు లోని అరుళ్ మిగు రామనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దేవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.తమిళ నాడు లో శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో ప్రార్థించిన ప్రధాన మంత్రి
January 20th, 07:38 pm
తమిళ నాడు లో శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దైవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని
January 18th, 06:59 pm
జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.కేరళలోని త్రిప్రయార్‌లోగల శ్రీ రామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి దైవ దర్శనం.. పూజలు
January 17th, 05:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని త్రిప్రయార్‌లోగల శ్రీ రామస్వామి ఆలయంలో దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, వారితోపాటు వటువులను కూడా సత్కరించారు.కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 17th, 01:59 pm
కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.మహారాష్ట్ర లోనినాసిక్ లో గల శ్రీ కాలారామ్ మందిరం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
January 12th, 03:18 pm
మహారాష్ట్ర లోని నాసిక్ లో గల శ్రీ కాలారామ్ మందిరం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ కుండం ను కూడాను ఆయన దర్శించుకొని, పూజ లో పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన పుష్పాంజలి ని సమర్పించారు.ఛత్తీస్గఢ్ లోని డోంగర్ గఢ్ లో బమ్ లేశ్వరి మాత కు జరిగిన పూజ కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
November 05th, 02:40 pm
ఛత్తీస్ గఢ్ లోని డోంగర్ గఢ్ లో బమ్ లేశ్వరి మాత కు జరిగిన అర్చన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. రాష్ట్ర ప్రజల సంతోషం కోసం మరియు వారి సమృద్ధి కోసం దీవెనల ను అనుగ్రహించవలసిందంటూ బమ్ లేశ్వరి మాత ను ఆయన వేడుకొన్నారు.ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 29th, 02:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీ. టి-20’ విభాగంలో కాంస్యం సాధించిన పూజకు ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:35 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీటర్ల టి-20’ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయంలో ఆమె చూపిన ప్రతిభ, పట్టుదలను ఆయన ప్రశంసించారు.