సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 06:55 pm
నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 13th, 06:30 pm
న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు.. ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సు
November 30th, 05:17 pm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు-ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 31st, 07:00 pm
ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.కెవాడియాలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 31st, 09:00 am
సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్‌లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 31st, 08:44 am
గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నివాళి
October 21st, 09:10 am
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బంది ధైర్యానికీ, వారి త్యాగాలకీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా నివాళులర్పించారు. దేశాన్ని, పౌరులను రక్షించడంలో వారి అచంచలమైన అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
November 29th, 09:54 am
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.ప్రధానమంత్రిని కలిసిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రకాశ్ సింగ్
September 03rd, 10:51 am
పోలీసు మాజీ ఉన్నతాధికారి శ్రీ ప్రకాశ్ సింగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. దేశ భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషిని శ్రీ మోదీ ప్రశంసించారు.75 years of the Supreme Court further enhance the glory of India as the Mother of Democracy: PM Modi
August 31st, 10:30 am
PM Modi, addressing the National Conference of District Judiciary, highlighted the pivotal role of the judiciary in India's journey towards a Viksit Bharat. He emphasized the importance of modernizing the district judiciary, the impact of e-Courts in speeding up justice, and reforms like the Bharatiya Nyaya Sanhita. He added that the quicker the decisions in cases related to atrocities against women, the greater will be the assurance of safety for half the population.జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 31st, 10:00 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థల సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. 75ఏళ్ల భారత సుప్రీం కోర్ట్ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారు. భారత సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా జిల్లా న్యాయ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అందరి కోసం సమీకృత కోర్టు గదులు, న్యాయపరమైన భద్రత అలాగే సంక్షేమం, కేసుల నిర్వహణ, న్యాయపరమైన శిక్షణ వంటి అంశాలను చర్చించ డానికి ఐదు వర్కింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.PM Modi's conversation with Lakhpati Didis in Jalgaon, Maharashtra
August 26th, 01:46 pm
PM Modi had an enriching interaction with Lakhpati Didis in Jalgaon, Maharashtra. The women, who are associated with various self-help groups shared their life journeys and how the Lakhpati Didi initiative is transforming their lives.మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 01:00 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు... నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో హాయినిస్తోంది.మహారాష్ట్ర, జలగావ్‌లో నిర్వహించిన లక్షాధికార సోదరీమణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 25th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో నిర్వహించిన లఖ్ పతి దీదీ సమ్మేళన్ (లక్షాధికార సోదరీమణుల సమావేశం)లో పాల్గొన్నారు. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల లక్షాధికారులైన 11 లక్షలమంది సోదరీమణులకు ధ్రువ పత్రాలను అందించి సత్కరించింది.జనవరి 6వ మరియు 7వ తేదీ లలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ /ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారత సమావేశం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి
January 04th, 12:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం జనవరి 6 వ, 7వ తేదీల లో జయ్‌పుర్ లోని రాజస్థాన్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో జరగనున్న డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ / ఇన్స్‌పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారత సమావేశం 2023 లో పాలుపంచుకోనున్నారు.You are ‘Amrit Rakshak’ of this ‘Amrit Kaal: PM Modi at Rozgar Mela
August 28th, 11:20 am
PM Modi distributed more than 51,000 appointment letters to newly inducted recruits via video conferencing. Addressing the occasion, PM Modi congratulated the new appointees for their selection as ‘Amrit Rakshak’ during the Amrit Kaal. He Called them ‘Amrit Rakshak’ as the new appointees will not only serve the country but will also protect the country and the countrymen. PM Modi emphasized the responsibility that comes with the selection of Defence or Security and Police Forces and said that the Government has been very serious about the needs of the Forces.ఉపాధి సమ్మేళనంలో 51,000కుపైగా నియామక లేఖలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
August 28th, 10:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా నియామక లేఖలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహించిన ఉపాధి సమ్మేళనం కింద తన పరిధిలోని కేంద్ర సాయుధ బలగాల (సిఎపిఎఫ్) కోసం దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరిని ఎంపిక చేసింది. తదనుగుణంగా వీరంతా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్), సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్), సాయుధ సరిహద్దు భద్రత దళం (ఎస్‌ఎస్‌బి), అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి), మాదక ద్రవ్య నిరోధం-నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి), ఢిల్లీ పోలీసు విభాగాల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆయా సంస్థలలో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ (సాధారణ విధులు); సహా సాధారణేతర విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలలో చేరుతారు.Government is working towards making domestic & international markets accessible to farmers: PM Modi
February 26th, 12:01 pm
The Prime Minister Shri Narendra Modi today addressed the Rozgar Mela of Uttar Pradesh Government via a video message. In the Mela, appointment letters were provided to direct recruits for Sub Inspectors in UP Police and equivalent posts in Nagrik Police, Platoon Commanders and Fire Department Second Officers.ఉత్తరప్రదేశ్ ఉపాధి మేళాలో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి మేళా సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ ఉపాధి మేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్లు, దానితో సమాన హోదాగల నాగరిక్ పోలీస్, ప్లటూన్ కమాండర్స్, అగ్నిమాపక విభాగం సెకండ్ ఆఫీసర్ల పోస్టులకు ప్రత్యక్ష విధానంలో ఎంపికైనవారికి నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి మేళాను ఉద్దేశించి దాదాపు ప్రతివారం ప్రసంగించే అవకాశం లభిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ వ్యవస్థల్లో సామర్థ్యానికి, నవ్య ఆలోచన విధానానికి తగిన ప్రతిభావంతులైన యువత దేశానికి నిరంతరం లభించడంపై తనకెంతో సంతోషంగా ఉందన్నారు.జనవరి21 వ, 22 వ తేదీ లలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి
January 20th, 07:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 21-22 తేదీల లో న్యూ ఢిల్లీ లో నేశనల్ ఎగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, పూసా లో ఏర్పాటైన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నారు.