కవి, మేధావి అందెశ్రీ మృతి.. ప్రధానమంత్రి సంతాపం

November 10th, 03:02 pm

ప్రముఖ కవి, మేధావి అందెశ్రీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ రమాకాంత్ రథ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

March 16th, 02:53 pm

ప్రముఖ కవి, పండితుడు శ్రీ రమాకాంత్ రథ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. శ్రీ రమాకాంత్ రథ్ జీ రచనలు, ప్రత్యేకించి ఆయన కవితలు సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారి ఆదరణను పొందాయని ప్రధాని అన్నారు.

ఢిల్లీలో ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 28th, 07:31 pm

ఈ రోజు ‘జహాన్-ఎ-ఖుస్రో’ కార్యక్రమానికి హాజరు కావడం సహజంగానే నాకెంతో ఆనందం కలిగించింది. ఖుస్రోకు వసంత రుతువు ఎంతో ఇష్టమైన కాలం. ఇవాళ ఢిల్లీలో విరిసిన ఈ వసంతం ప్రాంగణ వాతావరణమంతటా అలముకుంది. హజ్రత్ ఖుస్రో మాటల్లోనే చెబితే-

సూఫీ సంగీతోత్సవం ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’కు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 07:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూఫీ సంగీతోత్సవం “జహాన్-ఎ-ఖుస్రో-2025”లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ- హజ్రత్ అమీర్ ఖుస్రో సుసంపన్న వారసత్వానికి ప్రతీక అయిన ఈ వేడుకలో మానసిక ఉల్లాసం ఉప్పొంగడం అత్యంత సహజమన్నారు. ఖుస్రోకు ఎంతో ఇష్టమైన వసంత రుతు సుగంధం కాలానికి మాత్రమే పరిమితం కాదని, నేడిక్కడ జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ ప్రాంగణంలో వీచే గాలిలోనూ అది వ్యాపించిందని అభివర్ణించారు.

ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు

February 27th, 06:30 pm

న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.