స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
August 15th, 06:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలన అంతానికి కారణమైన మన ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధులు మాతృభూమి కోసం చూపిన అద్భుతమైన ధైర్యం, అవిశ్రాంత పోరాటం, సాటిలేని అంకితభావానికి ఈ జాతీయ పండుగ ఒక హృద్యమైన జ్ఞాపికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అలీ ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి అభినందనలు
May 16th, 01:35 pm
ఇరాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫాలిహ్ కాధిమ్ అల్-జైదీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఇరాక్‌తో దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఎంతో విలునిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి అభినందనలు
May 09th, 02:06 pm
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.శ్రీ అజయ్ రాయ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రధానమంత్రి
May 02nd, 07:19 am
శ్రీ అజయ్ రాయ్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.నియామక సందర్భంగా ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధాని అభినందన
April 25th, 10:47 pm
నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలంటూ శుభాకాంక్షలు అందించారు. ఆయన నిగర్వి అనీ, అలుపెరుగని అంకితభావంతో ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ప్రొఫెసర్ దాస్ అమూల్య సేవలను ఆయన కొనియాడారు. ఆయన విజయాలతో దేశమంతా గర్విస్తోందన్నారు.నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 25th, 10:46 pm
నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తుందనీ... సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందిస్తూ, కీలక సంస్కరణలను ముందుకు నడిపిస్తూ, పౌరుల 'జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ అన్ని రంగాల్లో ఆవిష్కరణలకు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా సేవలందిస్తూనే ఉందన్నారు.పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 14th, 09:21 am
పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.రాజ్యసభకు శ్రీ హరివంశ్… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 10th, 02:20 pm
శ్రీ హరివంశ్ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.Prime Minister extends his best wishes to Shri Nitish Kumar upon his taking oath as Rajya Sabha MP
April 10th, 02:07 pm
PM Modi extended his heartiest congratulations and best wishes to Shri Nitish Kumar on the occasion of him taking oath as a Member of the Rajya Sabha. The PM remarked that Shri Nitish Kumar is one of the nation's most experienced leaders whose commitment to good governance and indelible contribution to Bihar's development are widely recognized. He noted that it is a pleasure to see him return to Parliament.రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 26th, 12:11 pm
పవిత్ర రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, తపస్సు, నిగ్రహానికి మారుపేరైన మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం.. ఎలాంటి పరిస్థితినైనా స్థైర్యం, సంకల్పంతో ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రజలకు ఇస్తుందని శ్రీ మోదీ చెప్పారు.అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
March 21st, 08:24 am
నేడు పవిత్ర పండగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఖతార్ పాలకుడితో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపి... ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి
March 19th, 10:00 pm
ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రాంతీయ భద్రత పరమైన ఆందోళనలపై చర్చించారు.“గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదిన సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 19th, 08:46 am
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇవాళ “గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదినాల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరాది నేపథ్యంలో ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 19th, 08:03 am
పవిత్ర నవ సంవత్సరం (కొత్త సంవత్సరాది) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఆద్యంతం యావత్ ప్రజానీకం సంపూర్ణ సౌభాగ్యంతో వర్ధిల్లాలని, జాతీయ ప్రగతిపై నవ్య నిబద్ధత ఏర్పరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు
March 09th, 10:04 pm
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
March 08th, 11:32 pm
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యుత్తమ నైపుణ్యాలనూ, సంకల్పాన్నీ, సమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఈ టోర్నమెంట్ అంతా అసాధారణ పట్టుదలను జట్టు ప్రదర్శించిందని ప్రశంసించారు.ఆట్టుకల్ పొంగాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
March 03rd, 07:13 pm
పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
February 20th, 09:35 am
అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.