సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 13th, 06:55 pm

నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 13th, 06:30 pm

న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్‌ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రధానమంత్రిని కలిసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

January 15th, 07:28 pm

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ శ్రీ మోహన్‌ యాదవ్‌ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీ కలిశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం

January 09th, 07:22 pm

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

December 13th, 11:11 am

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రవేశిక పఠనంలో పాల్గొన్న పీఎంవో అధికారులు

November 26th, 09:25 pm

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు భారత రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఐక్యతా ప్రతిజ్ఞ చేయించిన కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు

October 31st, 02:06 pm

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటామని చెబుతూ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

ప్రధానమంత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం

December 12th, 12:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు సమావేశయ్యారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవేశికను పఠించిన ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు

November 26th, 08:17 pm

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ఇతర పీఎంవో అధికారులు, సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయంలో రాజ్యాంగ ప్రవేశికను పఠించారు.

హర్దోయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నివాళి

November 06th, 05:59 pm

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంవో ఇండియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీకే మిశ్రా నేతృత్వంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్‌’ ఉద్య‌మంలో పీఎంఓ అధికారులు

September 17th, 02:17 pm

ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీకే మిశ్రా నేతృత్వంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం అధికారులు.. ‘ఏక్ పేడ్ మా కే నామ్‌’(అమ్మ పేరుతో ఒక చెట్టు) ఉద్య‌మంలో పాలుపంచుకున్నారు.

పదో అంతర్జాతీయయోగ దినాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి కార్యాలయం

June 21st, 02:26 pm

పదో అంతర్జాతీయ యోగ దినాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ రోజు ఉదయం పూట నిర్వహించింది. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన యోగాభ్యాసం కార్యక్రమం లో, పిఎమ్ఒ లో సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా, సీనియర్ అధికారులు మరియు ఇతరులు పాలుపంచుకొన్నారు

ప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని

June 10th, 05:33 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం (పిఎంఒ)లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘పిఎంఒ’ అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ- ఈ కార్యాలయాన్ని ప్రజా ప్రాధాన్యంగల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆదినుంచీ శ్రమిస్తున్నట్లు శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ‘‘ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఒక ఉత్ప్రేరక శక్తిగా రూపుదిద్దడాడనికే మనం మొదటినుంచీ కృషి చేస్తున్నాం. తద్వారా ఇది సరికొత్త శక్తికి, స్ఫూర్తికి మూలం కాగలదు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

Every student of the Scindia School should strive to make India a Viksit Bharat: PM Modi

October 21st, 11:04 pm

PM Modi addressed the programme marking the 125th Founder’s Day celebration of ‘The Scindia School’ in Gwalior, Madhya Pradesh. “It is the land of Nari Shakti and valour”, the Prime Minister said as he emphasized that it was on this land that Maharani Gangabai sold her jewellery to fund the Swaraj Hind Fauj. Coming to Gwalior is always a delightful experience”, the PM added.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సింధియా పాఠశాల 125వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 21st, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘సింధియా పాఠశాల’ 125వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బహుళార్థ సాధక క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశిష్ట పూర్వ విద్యార్ధులతోపాటు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. సింధియా స్కూల్ 1897లో చరిత్రాత్మక గ్వాలియర్‌ కోటలో ఏర్పాటు చేయబడింది. కాగా, ఈ పాఠశాల వార్షికోత్సవం నేపథ్యంలో ీ53 2

రాజస్థాన్ లోప్రధాన మంత్రి కార్యక్రమాని కి రాజస్థాన్ ముఖ్యమంత్రి హాజరీ కి సంబంధించి ట్వీట్ చేసినపిఎమ్ఒ

July 27th, 10:46 am

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం లో ఏర్పాటైన ప్రధాన మంత్రి యొక్క కార్యక్రమం లో పాలుపంచుకోవడాని కి సంబంధించి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిస్పందించి ఈ క్రింది ట్వీట్ ను జారీ చేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న సీకర్ ను సందర్శించనున్నారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఒడిశా ముఖ్యమంత్రి

May 11th, 06:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ సమావేశమయ్యారు.

జోషీమఠ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న ప్రధాని కార్యాలయం

January 08th, 02:19 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో జోషీమఠ్‌ అంశంపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులుసహా జోషీమఠ్‌ జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ఇందులో పాల్గొంటారు.

In the last eight years, relations between India and Japan have reached new heights: PM

August 28th, 08:06 pm

PM Modi addressed a programme marking the commemoration of 40 years of Suzuki in India. The Prime Minister said, The success of Maruti-Suzuki also signifies the strong India-Japan partnership. In the last eight years, these relations between our two countries have reached new heights.

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 28th, 05:08 pm

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌లో జపాన్ రాయబారి గౌరవనీయ సతోషి సుజుకి, గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీష్ పంచాల్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ టి.సుజుకి మాజీ అధ్యక్షుడు శ్రీ ఒ.సుజుకి, మారుతి-సుజుకి చైర్మన్ శ్రీ ఆర్.సి.భార్గవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనగా, జపాన్‌ ప్రధానమంత్రి మాననీయ ఫుమియో కిషిడా పంపిన వీడియో సందేశం ప్రదర్శించబడింది.