TMC only abuses, threatens, spreads lies: PM Modi in Barrackpore, West Bengal
April 27th, 12:00 pm
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.PM Modi’s high-octane address electrifies Barrackpore
April 27th, 11:30 am
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 08th, 03:54 pm
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 10:26 am
దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.LDF and UDF have pushed Kerala into corruption, misgovernance and appeasement politics: PM Modi in Thiruvananthapuram
January 23rd, 11:47 am
Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.Huge crowd turns up as PM Modi addresses rally in Thiruvananthapuram, Kerala
January 23rd, 11:43 am
Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.కేరళలోని తిరువనంతపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 23rd, 11:00 am
కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాల్లో నేడు కొత్త ఊపొచ్చింది. నేటి నుంచి కేరళలో రైలు అనుసంధానం మరింత మెరుగవుతుంది. దేశంలోనే తిరువనంతపురం ఒక పెద్ద అంకుర సంస్థల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ మొదలైంది. నేడు దేశవ్యాప్తంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం ఒక గొప్ప ఆరంభం కూడా కేరళ నుంచి జరుగుతోంది. ఈ రోజు ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను ప్రారంభించాం. దీని ద్వారా దేశంలోని వీధి వ్యాపారులు, బండ్లపై వ్యాపారం చేసే వారు, ఫుట్‌పాత్‌లపై పనిచేసే వారు లబ్ధి పొందనున్నారు. అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం, ఈ పథకాల కోసం కేరళ ప్రజలకు, దేశ ప్రజలందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.కేరళలోని తిరువనంతపురంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 23rd, 10:45 am
కేరళలోని తిరువనంతపురంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మరికొన్నింటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ రోజు నవోత్తేజం లభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కేరళలో రైలు అనుసంధానం మరింత బలోపేతమైందనీ, తిరువనంతపురాన్ని అంకుర సంస్థల ప్రధాన నిలయంగా నిలిపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పేదల సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ముఖ్య కార్యక్రమమైన ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు’ను కూడా కేరళ వేదికగా ప్రారంభించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారికి, ఫుట్‌పాత్‌లపై పనిచేసుకునేవారికి ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాల సందర్భంగా కేరళతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అభినందనలు తెలిపారు.జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 22nd, 02:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.స్టార్టప్ ఇండియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 16th, 01:30 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ పీయూష్ గోయల్, దేశం నలుమూలల నుంచి విచ్చేసిన అంకుర సంస్థలకు చెందిన మిత్రులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరసోదరీలారా!గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎమ్ స్వనిధి) పథకం పునర్వ్యవస్థీకరణ, రుణ వ్యవధిని
August 27th, 02:49 pm
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎమ్ స్వనిధి) పథకం పునర్వ్యవస్థీకరణ, 31.12.2024 తర్వాతి కాలానికి రుణ వ్యవధి పొడిగింపు నిర్ణయాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తాజాగా రుణ వ్యవధిని 2030 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ పథకం మొత్తం వ్యయం రూపాయలు 7,332 కోట్లు. పథకం పునర్వ్యవస్థీకరణ ద్వారా 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు సహా మొత్తం 1.15 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా నిర్దేశించారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 25th, 06:42 pm
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 25th, 06:15 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
July 12th, 11:30 am
కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 12th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.