తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చారిత్రాత్మక రికార్డు... ప్రజలను అభినందించిన ప్రధాని
June 05th, 11:40 pm
దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 10:11 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు.Cabinet approves one new project covering Ahmedabad District in the state of Gujarat, increasing the existing network of Indian Railways by about 134 Kms
May 13th, 03:34 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the Ahmedabad–Dholera Semi High-Speed Double Line railway project in Gujarat at an estimated cost of ₹20,667 crore. India’s first semi high-speed rail project, developed with indigenous technology, aims to improve connectivity between Ahmedabad, Dholera SIR, the upcoming Dholera Airport and the Lothal National Maritime Heritage Complex while enhancing mobility, logistics efficiency and regional development across the state.అనువాదం: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో ‘లక్ష కంఠాల గీతా పారాయణం’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 11:45 am
నేను మొదలుపెట్టే ముందు.. కొంతమంది పిల్లలు తమ బొమ్మలను ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి ఎస్పీజీ, స్థానిక పోలీసులు వాటిని తీసుకునే విషయంలో సహాయం చేయండి. మీరు వెనుక వైపున మీ చిరునామా రాస్తే నేను ఖచ్చితంగా మీకు ఒక ధన్యవాద లేఖ పంపుతాను. ఎవరి దగ్గర ఏమున్నా దయచేసి వారికి ఇవ్వండి. వారు వాటిని తీసుకుంటారు. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ పిల్లలు ఎంత కష్టపడి పనిచేస్తారు. కొన్నిసార్లు వీటిని నేను గుర్తించక పోతే అది నాకు బాధ కలిగిస్తుంది.కర్ణాటకలోని ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 28th, 11:30 am
మూడు రోజుల క్రితం తాను గీతా భూమి అయిన కురుక్షేత్రంలో ఉన్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. నేడు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందిన, జగద్గురు శ్రీ మధ్వాచార్య గారి మహిమతో పావనమైన ఈ భూమికి రావడం తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని అన్నారు. ఈ సందర్భంలో లక్ష మంది ప్రజలు కలిసి చేసిన భగవద్గీత'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.మంగోలియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
October 14th, 01:15 pm
ఆరేళ్ల అనంతరం మంగోలియా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 10 సంవత్సరాలైన వేళ ఈ పర్యటన చోటుచేసుకొంది. ఈ సందర్భంగా ఈ రోజున మేం ఒక సంయుక్త తపాలా బిళ్లను విడుదల చేశాం.. ఇది మన ఉమ్మడి వారసత్వం, వైవిధ్యం, నాగరికత పరమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి
September 19th, 05:24 pm
గౌరవ బ్రిటన్ రాజు చార్లెస్ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై గౌరవ చార్లెస్ కు ఎంతో నిబద్ధత ఉంది. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.కర్తవ్య భవన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
August 06th, 12:15 pm
కర్తవ్య భవన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రజాసేవ పట్ల దృఢసంకల్పానికి, నిరంతర కృషికి ఈ భవనంఒక ప్రతీక అని ఆయన అభివర్ణించారు.న్యూఢిల్లీలో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్) సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
June 23rd, 09:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్) సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించారు.‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి
June 05th, 01:33 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మొక్కల పెంపకం కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న ప్రధాని
June 04th, 01:20 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, గురువారం (జూన్ 5న) ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. పర్యావరణ సంరక్షణ, హరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
April 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
April 12th, 01:09 pm
శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. లక్షలాది చెట్లను నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చిరస్మరణీయులని ప్రశంసించారు.మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 06:07 am
పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 07:30 pm
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 09:36 pm
నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం
January 28th, 09:02 pm
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.The holistic fusion of carbon credits with social responsibility will serve as the new philosophy of Green Credit: PM Modi
December 01st, 07:22 pm
Addressing a high-level event on 'Green Credit Programme', PM Modi said The holistic fusion of carbon credits with social responsibility will serve as the new philosophy of Green Credit. He added that in the health card of planet Earth there is an addition of some positive points and this will be reinforced through the Green Credit initiative.