పీయూష్ పాండే మృతి.. ప్రధానమంత్రి సంతాపం

October 24th, 11:29 am

వాణిజ్య ప్రకటనలు, కమ్యూనికేషన్ల రంగ దిగ్గజం శ్రీ పీయూష్ పాండే మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పాండే అసాధారణ సృజనాత్మక ప్రతిభనూ, భారతదేశ వాణిజ్య ప్రకటనల రంగానికి ఆయన అందించిన మహత్తర సేవలనూ ప్రధానమంత్రి నిండుమనసుతో ఓ సందేశంలో స్మరించుకొన్నారు.