పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

August 02nd, 02:55 pm

దేశ ప్రజలకు గర్వకారణమైన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన శ్రీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం (హర్ గర్ తిరంగా) కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను కోరారు. జెండాతో ఉన్న సెల్ఫీ లేదా ఫోటోలను హర్ గర్ తిరంగా వె‌బ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

August 02nd, 02:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు దేశం కోసం మువ్వన్నెల పతాకాన్ని అందించడంలో శ్రీ పింగళి వెంకయ్య చేసిన కృషిని స్వరించుకొన్నారు. ఈ నెల 9-15 తేదీల మధ్య కాలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారాను, ప్రజలు వారి సెల్ఫీలను harghartiranga.com లో పంచుకోవడం ద్వారాను ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ప్రచార ఉద్యమాన్ని బలపరచవలసిందిగా కూడా శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

August 02nd, 10:16 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.