ముంబయి నగరంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 08th, 03:44 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ప్రజాదరణ గల ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కె.ఆర్.నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ఇతర మంత్రులు, భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కెయిచీ ఓనో, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీసోదరులారా!

నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

October 08th, 03:30 pm

నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మహారాష్ట్రలోని ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులనూ ప్రారంభించిన ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి హజారైన ప్రముఖులందరినీ స్వాగతిస్తూ.. వారందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విజయదశమి, కోజాగరి పూర్ణిమ వేడుకలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దీపావళి పండగ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సమ్మిట్ ప్లీనరీ సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

June 02nd, 05:34 pm

మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ఐఏటీఏ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పీటర్ ఎల్బర్స్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్, ఇండిగో డైరెక్టర్ రాహుల్ భాటియా, అతిథులు, ఆహూతులందరికీ!

ఐఏటీఏ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 02nd, 05:00 pm

విమానయాన రంగంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీమ్).. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్) ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులను స్వాగతించారు. నాలుగు దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించడంలోని ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కాలంలో భారత్‌లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, నేటి భారత్ ఎప్పుడూ లేనంత విశ్వాసంతో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వైమానిక రంగంలో భారత పాత్రను ప్రస్తావిస్తూ, విస్తారమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా విధానపరమైన నాయకత్వం, ఆవిష్కరణలు, సమగ్ర అభివృద్ధికి చిహ్నంగా భారత్ నిలిచిందన్నారు. నేడు, అంతరిక్ష-విమానయాన రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో పౌర విమానయాన రంగం సాధించిన చారిత్రాత్మక పురోగతిని ప్రపంచమంతా చూస్తోందన్నారు.

షహీదాబాద్ ఆర్ఆర్టీఎస్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకూ నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకోపైలట్లతో ప్రధాని సంభాషణ

January 05th, 08:50 pm

అవరోధాలను బద్దలు గొడుతూ, మన భవితను రూపుదిద్దుకుంటున్నాం.

నమోభారత్ రైలులో విద్యార్థులు, లోకో పైలట్లతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సంభాషణ నా యువ స్నేహితుల అద్భుత ప్రతిభ నాలో నూతన శక్తిని నింపింది: పీఎం

January 05th, 08:48 pm

సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు వివిధ చిత్రలేఖనాలు, కళాకృతులను బహుమతిగా ఇచ్చిన యువ మిత్రులతో సంభాషించారు.

దేశానికి అవసరమైన అభివృద్ధిని బీజేపీ మాత్రమే అందించగలదు: అజ్మీర్‌లో ప్రధాని మోదీ

April 06th, 03:00 pm

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అజ్మీర్-నాగౌర్ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అభివృద్ధి వైపు గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు. బిజెపి స్థాపన దివస్ శుభ సందర్భంగా మాట్లాడుతూ, వీర్ తేజాజీ మహారాజ్, మీరా బాయి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ వంటి గౌరవనీయులైన వ్యక్తులకు నివాళులు అర్పిస్తూ, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పరాక్రమ చరిత్రను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు

April 06th, 02:30 pm

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అజ్మీర్-నాగౌర్ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అభివృద్ధి వైపు గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు. బిజెపి స్థాపన దివస్ శుభ సందర్భంగా మాట్లాడుతూ, వీర్ తేజాజీ మహారాజ్, మీరా బాయి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ వంటి గౌరవనీయులైన వ్యక్తులకు నివాళులు అర్పిస్తూ, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పరాక్రమ చరిత్రను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi

March 12th, 02:15 pm

Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.

రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి

March 12th, 01:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.

న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 27th, 05:00 pm

కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!

ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని

January 27th, 04:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.