హూల్ దివస్ సందర్భంగా గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళులు

June 30th, 02:28 pm

ఆరాధనీయ ‘హూల్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత గిరిజనుల అజేయ ధైర్య, సాహసాలతో పాటు వారి అసాధారణ పరాక్రమానికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారు. చరిత్రాత్మక సంథాల్ తిరుగుబాటును ప్రధానమంత్రి స్మరించుకొంటూ సిదో-కాన్హూ, చాంద్-భైరవ్‌లతో పాటు ఫూలో-ఝానోలతో పాటు వలస పాలకుల పీడనకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవనాన్ని త్యాగం చేసిన పూజనీయ స్వాతంత్ర్య వీరులు, వీరాంగనలందరి శాశ్వత వారసత్వానికి జోహార్లు అర్పించారు.