ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
April 21st, 01:09 pm
భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 15th, 11:10 am
పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 15th, 11:00 am
కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 31st, 10:25 am
ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 31st, 10:15 am
భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రముఖ కన్నడ రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి సంతాపం
September 24th, 04:29 pm
ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మనస్సాక్షిని కదిలించిన, దేశ అంతరాత్మను తాకిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను అభివర్ణించారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.