మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

May 19th, 06:42 pm

ఓస్లోలో జరుగుతున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో 2026 మే 19న ఫిన్లాండ్ ప్రధాని శ్రీ పెటెరి ఓర్పోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

May 15th, 07:56 am

ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.

ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)

May 11th, 09:00 pm

ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా గౌరవ ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పోతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ

February 18th, 05:10 pm

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 2026 ఫిబ్రవరి 18న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టేరి ఓర్పోతో సమావేశమయ్యారు.

ఫిన్లాండ్ ప్రధానితో భారత ప్రధాని శ్రీ మోదీ బేటీ

February 18th, 02:04 pm

గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై ప్రధానమంత్రికి ప్రపంచ నాయకుల నుంచి కొనసాగుతున్న అభినందన సందేశ పరంపర

June 10th, 12:00 pm

భారత ప్రధానమంత్రిగా శ్రీ న‌రేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రపంచ నాయకుల అభినందన సందేశ పరంపర ఇంకా కొనసాగుతోంది. వీటిపై ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ- సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.