అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని
October 14th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఉదయం 11:15 గంటల సమయంలో నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలతోపాటు దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం
August 27th, 04:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 25th, 06:42 pm
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 25th, 06:15 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కర్తవ్య భవన్‌కు 6వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
August 04th, 05:44 pm
అత్యాధునిక, సమర్థ, పౌర-కేంద్రక పాలనపై ప్రధానమంత్రి దృక్కోణానుగుణ ప్రభుత్వ నిబద్ధతలో కర్వవ్య భవన్ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. సెంట్రల విస్టా భవన సముదాయం విస్తృత రూపాంతరీకరణలో ప్రధాని ప్రారంభించనున్న కర్తవ్య భవన్-03 ఒక అంతర్భాగం. పరిపాలన ప్రక్రియల క్రమబద్ధీకరణ, చురుకైన పాలన లక్ష్యంగా నిర్మితమవుతున్న సార్వత్రిక కేంద్ర సచివాలయ భవన సముదాయంలో ఇది మొదటిది.అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:00 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!రైజింగ్ నార్త్ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు-2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 10:30 am
రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం.... ప్రధాని సమాధానం
February 04th, 07:00 pm
గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.Prime Minister Shri Narendra Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Lok Sabha
February 04th, 06:55 pm
During the Motion of Thanks on the President’s Address, PM Modi highlighted key achievements, stating 250 million people were lifted out of poverty, 40 million houses were built, and 120 million households got piped water. He emphasized ₹3 lakh crore saved via DBT and reaffirmed commitment to Viksit Bharat, focusing on youth, AI growth, and constitutional values.ఇథనాల్ కలిపిన పెట్రోలు (ఈబీపీ) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీస్) ఇథనాల్ సేకరణ పద్ధతికి మంత్రి మండలి ఆమోదముద్ర
January 29th, 03:04 pm
ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) 2024-25కుగాను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ)కు ఇథనాల్ కొనుగోలు ధరను సవరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇథనాల్ సరఫరా నవంబరు 1, 2024న ప్రారంభమై, అక్టోబరు 31, 2025తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రిత పెట్రోల్ (ఈబీపీ) విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ ను కొనుగోలు చేయాలి. దీనికి అనుగుణంగా, సీ హెవీ మొలాసెస్ (సీహెచ్ఎం) నుంచి తయారు చేసిన ఇథనాల్‌కు ఈబీపీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రించిన మిల్లు ధర 2024-25 ఏడాదికి (2024 నవంబరు 1 నుంచి 2025 అక్టోబరు 31 మధ్య కాలానికి) లీటరు ఒక్కింటికి రూ.56.58 నుంచి రూ.57.97గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 02:15 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీమన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్షా ఖడ్సే, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు సహా దేశం నలుమూలల నుంచి హాజరైన నా యువ మిత్రులారా!‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 12th, 02:00 pm
స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూ, ఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారు. దేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారు. స్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీ, వారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారు. యువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లా, ఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారు. ఆయననూ, ప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే, 21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమై, వారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన
December 16th, 01:00 pm
అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.పెట్టుబడులపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన భారత్, సౌదీ అరేబియా
July 28th, 11:37 pm
పెట్టుబడులపై భారతదేశం-సౌదీ అరేబియా ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ లు సహాధ్యక్షత వహించారు.Transformation of Indian Railways is the guarantee of Viksit Bharat: PM Modi
March 12th, 10:00 am
PM Modi dedicated to the nation and laid the foundation stone of various developmental projects worth over Rs 1,06,000 crores at Dedicated Freight Corridor’s Operation Control Centre in Ahmedabad, Gujarat. He added that in the 75 days of 2024, projects worth more than Rs 11 lakh crores have been inaugurated or foundation stones laid while projects worth Rs 7 lakh crores have been unveiled in the last 10-12 days.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన
March 12th, 09:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి ఈ కార్యక్రమం స్థాయి, పరిణామం రైల్వేల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనిదని ప్రధాని అభివర్ణించారు. దీనికి సంబంధించి రైల్వే రంగానికి అభినందనలు తెలిపారు.Central Govt is focussing on modern connectivity in Odisha so that local resources improve the economy of the state: PM
March 05th, 05:30 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,600 crores in Chandikhole, Odisha today. The projects relate to sectors including oil & gas, railways, road, transport & highways and atomic energy.ఒడిశాలోని చండిఖోల్ లో రూ.19,600 కోట్ల రూపాయలు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
March 05th, 01:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలోని చండిఖోల్ లో రూ.19,600 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన ,జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్, రోడ్డు, ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, అటామిక్ ఎనర్జీ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.తెలంగాణలోని సంగారెడ్డిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 05th, 10:39 am
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు కొండా సురేఖ గారు, కె.వెంకటరెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్.