అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 13th, 05:30 pm
అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 13th, 05:00 pm
అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 11:00 am
పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం
January 14th, 10:45 am
ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ ప్రారంభోత్సవం.. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రాజెక్టుల ప్రారంభం-శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 11th, 12:30 pm
వేదికపై ఆసీనులైన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, సాంకేతిక మాధ్యమం ద్వారా సంధానితులైన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ భగీరథ్ ఛౌదరి సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, దేశవ్యాప్తంగా గల రైతున్నలు, సోదరీసోదరులారా!వ్యవసాయ రంగంలో రెండు ముఖ్య పథకాలను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ: మొత్తం వ్యయం రూ. 35,440 కోట్లు
October 11th, 12:00 pm
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు రైతులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు.భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 04th, 11:15 am
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025
January 04th, 10:59 am
PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 01:00 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 12:30 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.Our government is actively working to ensure a secure roof over every poor person's head: PM Modi
February 10th, 01:40 pm
Prime Minister Narendra Modi addressed ‘Viksit Bharat Viksit Gujarat’ program via video conferencing. During the programme, the Prime Minister inaugurated and performed Bhoomi Poojan of more than 1.3 lakh houses across Gujarat built under Pradhan Mantri Awas Yojana (PMAY) and other housing schemes. He also interacted with the beneficiaries of Awas Yojna. Addressing the gathering, the Prime Minister expressed happiness that people from every part of Gujarat are connected with the development journey of Gujarat.‘‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 10th, 01:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని విభిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై), ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించతలపెట్టిన, పూర్తయిన 1.3 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.PM Modi campaigns in Madhya Pradesh’s Betul, Shajapur and Jhabua
November 14th, 11:30 am
Amidst the ongoing election campaigning in Madhya Pradesh, Prime Minister Modi’s rally spree continued as he addressed multiple public meetings in Betul, Shajapur and Jhabua today. PM Modi said, “In the past few days, I have traveled to every corner of the state. The affection and trust towards the BJP are unprecedented. Your enthusiasm and this spirit have decided in Madhya Pradesh – ‘Phir Ek Baar, Bhajpa Sarkar’. The people of Madhya Pradesh will come out of their homes on 17th November to create history.”కర్నాటకలోని యాద్గిర్ జిల్లా కోడెకల్‌లో శంకుస్థాపన, పలు అభివృద్ధి ప్రాజెక్టుల అంకితం కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 19th, 12:11 pm
కర్నాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ జీ, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ భగవంత్ ఖుబా జీ, కర్ణాటక ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి తరలివచ్చిన ప్రియమైన నా సోదర సోదరీమణులారా!కర్ణాటకలోని కోడెకల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
January 19th, 12:10 pm
కర్ణాటకలోని కోడెకల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. కోడెకల్‌లో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టనున్న యాద్గిర్ బహుళ-గ్రామ తాగునీటి సరఫరా పథకం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ఎన్ హెచ్ -150సీ లో 65.5 కి.మీ విభాగం (బడదల్ నుంచి మరదగిఎస్ ఆందోల వరకు) , నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కాలువ - పొడిగింపు పునరుద్ధరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 01st, 12:31 pm
ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘పీఎం-కిసాన్ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 01st, 12:30 pm
దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 28th, 11:01 am
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!