సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
June 28th, 08:30 pm
2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్ సత్కారం
June 28th, 03:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.సెయిషెల్స్‌లో ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ
June 27th, 03:30 pm
సెయిషెల్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యంతో కూడిన ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది. ఈ పర్యటన, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించి, భారతదేశం-సెయిషెల్స్ మధ్య ఉన్న సన్నిహిత మరియు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ప్రధాని మోదీ సెయిషెల్స్ నాయకత్వంతో సమావేశమవుతారు.సీషెల్స్ పర్యటన (జూన్ 27 నుంచి 29, 2026 వరకు) నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన
June 27th, 08:25 am
నా మిత్రుడు, సీషెల్స్ దేశ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు 2026 జూన్ 27 నుంచి 29 వరకు నేను ఆ దేశంలో పర్యటిస్తాను. అక్కడ జరగనున్న జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటాను.ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)
June 25th, 06:05 pm
సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
February 09th, 03:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.సీషెల్స్ అధ్యక్షునితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం
February 09th, 01:00 pm
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
October 12th, 09:13 am
సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.