ఆసియా క్రీడల మహిళల 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతక విజేత పారుల్ చౌదరికి ప్రధానమంత్రి అభినందన
October 03rd, 11:25 pm
ఆసియా క్రీడల మహిళల 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణి పారుల్ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందించారు. ఈ మేరకు ఆమె ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం నిజంగా అత్యద్భుతమని, భవిష్యత్తులో ఆమె ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆయన ఆకాంక్షించారు.మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో పారుల్ చౌదరి రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం
October 02nd, 10:02 pm
ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ పోటీలో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.