పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి
August 14th, 08:58 am
పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.దేశవిభజన- భయ విహ్వలత సంస్మరణ దినాన్ని పాటించిన ప్రధాని
August 14th, 08:52 am
దేశవిభజన- భయ విహ్వలత సంస్మరణ దినాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత విషాదభరిత అధ్యాయాల్లో ఒకటైన విభజన కాలంలో, ఎంతో మంది ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, పడ్డ వేదనను ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.దేశంలో ఐకమత్యం, సోదరభావ బంధాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నా: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 14th, 09:51 am
దేశ విభజన సమయంలోని బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భయానక విభజన సంస్మరణ దినం సందర్భంగా 'ఎక్స్'లో చేసిన పోస్టులో, విభజన కారణంగా అనేక మంది ప్రజలపై పడిన ప్రభావం, వారి ఇబ్బందులను ఆయన గుర్తు చేసుకున్నారు.గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ
August 28th, 08:48 pm
జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 28th, 08:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.