ఏఐ పురోగతి నుండి టి20 ప్రపంచ కప్ వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ ఎదుగుదలను ప్రస్తావించిన ప్రధానమంత్రి మోదీ
February 22nd, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్‌లో, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ తన అనుభవాల గురించి మాట్లాడారు. భారత సంతతికి చెందిన క్రికెటర్లు, అవయవ దానం, నదీ ఉత్సవాలు, డిజిటల్ భద్రత, పరీక్ష పే చర్చా వంటి అనేక ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్‌లో 'రాజాజీ ఉత్సవ్' జరుపుకుంటామని ఆయన హైలైట్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీకి నారీ శక్తితో ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.‘పరీక్షా పే చర్చ 2026’ రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాం విద్యార్థులతో తన సంభాషణ వివరాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 10th, 05:06 pm
తొమ్మిదో సంచిక ‘పరీక్షా పే చర్చ (పీపీసీ)-2026’లో విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. పీపీసీ-2026 రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాంలకు చెందిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ, ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించామని శ్రీ మోదీ చెప్పారు.అనువాదం: ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమం 2వ ఎపిసోడ్‌లో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ
February 09th, 10:30 am
ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.పరీక్షా పే చర్చ- 2026 రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి విద్యార్థులతో సంభాషించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
February 09th, 10:00 am
తొమ్మిదో ఎడిషన్ పరీక్షా పే చర్చ (పీపీసీ)- 2026 కొనసాగింపులో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థులతో సంభాషించారు. పీపీసీ- 2026 రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి నగరాలకు చెందిన పరీక్షా యోధులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. పరీక్షా పే చర్చ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ.. ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. కోయంబత్తూరు ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. తమిళనాడు విద్యార్థుల ఉత్తేజమూ, ఉత్సుకతా తనను ముగ్ధుడిని చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వణక్కం’ అని అభివాదం చేస్తూ సరదాగా వారితో ముచ్చటించారు. ప్రధానమంత్రిని చూసినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎంతో ఆర్భాటంగా, నాటకీయంగా వస్తారనుకున్నామనీ.. కానీ ఆయన చాలా సాధారణంగా, నిరాడంబరంగా, మనలో ఒకరిగా కనిపించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి రాక తమలో ఉత్తేజం నింపిందని ఒక విద్యార్థి చెప్పారు.విద్యార్థుల అపార ప్రతిభనీ, ‘పరీక్షా పే చర్చా’ స్ఫూర్తినీ చాటిచెబుతూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
February 09th, 09:06 am
మన విద్యార్థుల్లో అసాధారణ ప్రతిభ సమృద్ధిగా ఉందనీ, వారిలో తమ కలలను నిజం చేసుకొనేందుకు పూర్తి సామర్థ్యం ఉందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు వారి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాలను ఉపయోగించి వ్యక్తిగత పురోగతినీ, విజయాన్నీ పొందడానికి మార్గదర్శకత్వం వహించడం ‘పరీక్షా పే చర్చా’ ఉద్దేశమని ఆయన అన్నారు.“పరీక్షా పే చర్చా 2026” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ
February 06th, 10:21 am
నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాంపరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
February 06th, 10:00 am
పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.పరీక్షా పే చర్చా-26లో పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలికిన ప్రధానమంత్రి
February 05th, 09:56 pm
రేపటి రోజున, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు నిర్వహించే పరీక్షాపేచర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ సంవత్సరపు సంచికలో పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఉంటాయనీ, ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండడానికీ, నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికీ ప్రాధాన్యంగా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వేదిక తనకు సదా ఆనందాన్నిస్తుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో మాట్లాడే అవకాశం కలగడమే దీనికి కారణమని ప్రధానమంత్రి తెలిపారు.