23 ఫిబ్రవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 119 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 23rd, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతిచోటా క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్‌లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను. కానీ భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైంది. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ, విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 విజయం కావచ్చు. ఒకే రాకెట్‌తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 సంవత్సరాలలోనే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో మనం గమనిస్తోన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య వందలకు చేరుకుంటుందని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉంటారు! జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది.Pariksha Pe Charcha 2025 All Episodes
February 18th, 05:30 pm
For Pariksha Pe Charcha 2025, Prime Minister Narendra Modi brought together India’s top achievers— Deepika Padukone, Sadhguru, Mary Kom, Avani Lekhara and other icons—to inspire students. Experts from sports, cinema, spirituality, technology and public service shared success strategies, mental wellness tips and holistic guidance to help students unlock their potential and appear for exams with confidence.పరీక్షల ఒత్తిడిని అధిగమించడంలో విజయం సాధించిన ఎగ్జామ్ వారియర్ల అనుభవాలను వినమని ప్రధానమంత్రి సూచన
February 17th, 07:41 pm
పరీక్షల ఒత్తిడిపై జయించిన ఎగ్జామ్ వారియర్లతో కూడిన ‘పరీక్షా పే చర్చా’ ప్రత్యేక కార్యక్రమం ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఒత్తిడిని జయించడం, ఆందోళనను అదుపులో ఉంచుకోవడం వంటి అంశాలు సహా కార్యక్రమంలో పాల్గొనే వారు పరీక్షలకు సంబంధించి తమ అనుభవాలను, వ్యూహాలను పంచుకుంటారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు సానుకూలతే ప్రధాన నేస్తం: ప్రధానమంత్రి
February 15th, 05:58 pm
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సానుకూలతే ప్రధాన ఆయుధమవుతుందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ అందరూ చూడాలని కోరారు.When it comes to wellness and mental peace, Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities: PM
February 14th, 08:15 pm
Remarking that Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities when it comes to wellness and mental peace, the Prime Minister Shri Narendra Modi urged everyone to watch the 4th episode of Pariksha Pe Charcha tomorrow.సరైన పోషకాహారం తీసుకుంటే పరీక్షలు బాగా రాయగలుగుతారు: ప్రధానమంత్రి
February 13th, 07:27 pm
పరీక్షలు బాగా రాయడానికి సరైన పోషకాహారం, తగినంత నిద్ర దోహదపడతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రేపు ప్రసారమయ్యే పరీక్షా పే చర్చా నాలుగో ధారావాహికను అందరూ వీక్షించాలని కోరారు.Tech, gadgets, more screen time—major dilemmas for students, parents and teachers during exams: PM Modi
February 12th, 02:00 pm
Remarking that Technology, the role of gadgets during exams and more screen time among students are some of the biggest dilemmas students, parents and teachers face, the Prime Minister Shri Narendra Modi urged everyone to watch the 3rd episode of Pariksha Pe Charcha tomorrow.‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాలన్నింటినీ తప్పక చూడండి: ప్రధానమంత్రి
February 11th, 02:57 pm
‘పరీక్షా పే చర్చా-2025’లోని అన్ని కార్యక్రమాలనూ అందరూ తప్పక తిలకించి ఎగ్జామ్ వారియర్లను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విజ్ఞప్తి చేశారు.ఫిబ్రవరి 12న మానసిక ఆరోగ్యంపై ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం: ప్రధానమంత్రి
February 11th, 01:53 pm
మానసిక, దైహిక ఆరోగ్యం గురించి చర్చించేందుకు ‘ఎక్జామ్ వారియర్లు’ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పరీక్షా పే చర్చ 2025: పరీక్షలకు అతీతంగా - జీవితం మరియు విజయంపై సంభాషణ
February 10th, 03:09 pm
చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ ఈరోజు ఉదయం 11 గంటలకు భారత కాలమానం ప్రకారం జరిగింది, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో ఆలోచింపజేసే చర్చలో ఒకచోట చేర్చింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని తగ్గించడం మరియు విద్య పట్ల సానుకూల విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా జరిగిన ఈ వార్షిక కార్యక్రమం, మరోసారి అభ్యాసం, జీవిత నైపుణ్యాలు మరియు మానసిక శ్రేయస్సుపై అమూల్యమైన అంతర్దృష్టులను అందించింది.Be an example; don't demand respect, command respect. Lead by doing, not by demanding: PM Modi on PPC platform
February 10th, 11:30 am
At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.‘పరీక్షా పే చర్చా-2025’ లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి
February 10th, 11:00 am
సుందర నర్సరీలో ఈరోజు ఏర్పాటైన ‘పరీక్షా పే చర్చా’ (పీపీసీ) ఎనిమిదో సంచిక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. దేశం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులతో ఆహ్లాదకర వాతావరణంలో ముచ్చటించిన ప్రధాని, ఈ సందర్భంగా అనేక అంశాలను స్పృశించారు. శీతాకాలంలో శరీరంలో వేడిని కలిగించే నువ్వుల మిఠాయిని ప్రధాని విద్యార్థులకు పంచారు."పరీక్షా పే చర్చ" తాజాగా.. ఉపయుక్తంగా మళ్ళీ మీ ముందుకు : ప్రధాన మంత్రి
February 06th, 01:18 pm
పరీక్షా పె చర్చ 2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు: