‘పరీక్షా పే చర్చ 2026’ రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాం విద్యార్థులతో తన సంభాషణ వివరాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 10th, 05:06 pm

తొమ్మిదో సంచిక ‘పరీక్షా పే చర్చ (పీపీసీ)-2026’లో విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. పీపీసీ-2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాంలకు చెందిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ, ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించామని శ్రీ మోదీ చెప్పారు.

అనువాదం: ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమం 2వ ఎపిసోడ్‌లో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ

February 09th, 10:30 am

ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.

పరీక్షా పే చర్చ- 2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి విద్యార్థులతో సంభాషించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

February 09th, 10:00 am

తొమ్మిదో ఎడిషన్ పరీక్షా పే చర్చ (పీపీసీ)- 2026 కొనసాగింపులో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థులతో సంభాషించారు. పీపీసీ- 2026 రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి నగరాలకు చెందిన పరీక్షా యోధులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. పరీక్షా పే చర్చ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ.. ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. కోయంబత్తూరు ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. తమిళనాడు విద్యార్థుల ఉత్తేజమూ, ఉత్సుకతా తనను ముగ్ధుడిని చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వణక్కం’ అని అభివాదం చేస్తూ సరదాగా వారితో ముచ్చటించారు. ప్రధానమంత్రిని చూసినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎంతో ఆర్భాటంగా, నాటకీయంగా వస్తారనుకున్నామనీ.. కానీ ఆయన చాలా సాధారణంగా, నిరాడంబరంగా, మనలో ఒకరిగా కనిపించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి రాక తమలో ఉత్తేజం నింపిందని ఒక విద్యార్థి చెప్పారు.

విద్యార్థుల అపార ప్రతిభనీ, ‘పరీక్షా పే చర్చా’ స్ఫూర్తినీ చాటిచెబుతూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

February 09th, 09:06 am

మన విద్యార్థుల్లో అసాధారణ ప్రతిభ సమృద్ధిగా ఉందనీ, వారిలో తమ కలలను నిజం చేసుకొనేందుకు పూర్తి సామర్థ్యం ఉందనీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు వారి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాలను ఉపయోగించి వ్యక్తిగత పురోగతినీ, విజయాన్నీ పొందడానికి మార్గదర్శకత్వం వహించడం ‘పరీక్షా పే చర్చా’ ఉద్దేశమని ఆయన అన్నారు.

“పరీక్షా పే చర్చా 2026” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

February 06th, 10:21 am

నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాం

పరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

February 06th, 10:00 am

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీలోని 7 ఎల్ కేఎమ్ వద్ద ఎగ్జామ్ వారియర్స్ (పరీక్ష యోధులు)తో జరిగిన పరీక్ష పే చర్చా ప్రత్యేక ఎపిసోడ్ ను వీక్షించాలని కోరిన ప్రధానమంత్రి

February 03rd, 04:45 pm

ఫిబ్రవరి 6, 2026 ప్రసారమయ్యే ప్రత్యేక పరీక్షా పే చర్చా ఎపిసోడ్‌ను వీక్షించాలని దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతలోని సమష్టి స్ఫూర్తి, ఆసక్తికరమైన సంభాషణలను గమనించవచ్చని ఆయన తెలిపారు.

ఈ ఏడాది పరీక్షా పే చర్చ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలను ఆహ్వానించిన ప్రధాని

January 07th, 07:05 pm

పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు.

30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 30th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-

పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

When it comes to wellness and mental peace, Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities: PM

February 14th, 08:15 pm

Remarking that Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities when it comes to wellness and mental peace, the Prime Minister Shri Narendra Modi urged everyone to watch the 4th episode of Pariksha Pe Charcha tomorrow.

Politics is about winning people's hearts, says PM Modi in podcast with Nikhil Kamath

January 10th, 02:15 pm

Prime Minister Narendra Modi engages in a deep and insightful conversation with entrepreneur and investor Nikhil Kamath. In this discussion, they explore India's remarkable growth journey, PM Modi's personal life story, the challenges he has faced, his successes and the crucial role of youth in shaping the future of politics.

పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

January 10th, 02:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్‌ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గుజరాత్‌లోని వద్‌నగర్‌ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.

National Creator Awards is giving identity to the new era before its onset: PM Modi

March 08th, 10:46 am

PM Modi presented the first-ever National Creators Award today at Bharat Mandapam. He underlined that it is the country’s responsibility to walk side by side with the change of times and the advent of a new era and said that the nation is fulfilling that responsibility today with the first-ever National Creator Awards.

మొట్టమొదటి జాతీయ సృష్టికర్తల (క్రియేటర్స్) అవార్డుల విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి

March 08th, 10:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో మొదటి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేశారు. విజేతలతో కాసేపు ముచ్చటించారు. సృజనాత్మకతను ఉపయోగించి సానుకూల మార్పును ప్రేరేపించినందుకు ఈ అవార్డును లాంచ్ ప్యాడ్ గా భావిస్తారు.

'పరీక్ష పె చర్చ' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను: పీఎం

January 27th, 08:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 'ప‌రీక్ష పే చర్చ'లో ప‌రీక్ష యోధుల స‌మావేశం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పరీక్షలను సరదాగా, ఒత్తిడి లేకుండా చేయడానికి మునుపటి పిపిసి కార్యక్రమాల నుండి వివిధ అంశాలను, ఆచరణాత్మక చిట్కాలను కూడా పంచుకున్నారు.

విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపే సాధనమే పరీక్షా పే చర్చ, వారు దరహాసంలో పరీక్షలకు వెళ్లేలా అది చేస్తుంది : ప్రధానమంత్రి

December 14th, 11:22 pm

విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపించడం, వారు దరహాసంతో పరీక్షకు కూచునేలా చేయడం పరీక్షా పే చర్చ లక్ష్యం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం:ప్రధాని

February 25th, 09:44 am

అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్‌లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్‌ చేశారు.

పరీక్ష పే చర్చ ను గురించినసూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి

January 12th, 03:00 pm

పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెల్లడించారు.