ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 28th, 09:36 pm

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం

January 28th, 09:02 pm

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివ‌ృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.

పురుషుల జావెలిన్ త్రో పోటీలో రజత పతకాన్ని

September 08th, 08:33 am

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 41 పోటీలో వెండి పతకాన్ని క్రీడాకారుడు

మహిళల 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన

September 08th, 08:31 am

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని క్రీడాకారిణి సిమ్రన్ శర్మ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

పురుషుల షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమాను అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 07th, 09:04 am

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కంచు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమా గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు న అభినందించారు.

హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 06th, 05:22 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కాంస్య పతకాన్ని గెలిచిన జూడో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 05th, 10:26 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల 60 కిలో గ్రాముల జె1 పోటీలో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కంచు పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అభినందనలను తెలియజేశారు.

పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు

September 05th, 08:05 am

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను, దృఢ దీక్షను ప్రధాని ప్రశంసించారు.

మెన్స్ క్లబ్ త్రోలో స్వర్ణం సాధించిన ధరంబీర్ కు ప్రధాని శుభాకాంక్షలు

September 05th, 07:59 am

పారిస్ పారాలింపిక్ క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు ధరంబీర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం.

పారాలింపిక్స్ క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని

September 04th, 04:33 pm

పారిస్ పారాలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అథ్లెట్ల అంకితభావం, పట్టుదలను శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రతి క్రీడాకారుడికి వారు సాధించిన అద్భుతమైన విజయాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

షాట్ పుట్ లో రజత పతక విజేత సచిన్ ఖిలారికి ప్రధాని అభినందనలు

September 04th, 03:30 pm

పారిస్ పారాలింపిక్స్-2024లో పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 విభాగంలో రజతం సాధించిన సచిన్ ఖిలారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.

కాంస్య విజేత మరియప్పన్ తంగవేలుకు ప్రధాని అభినందనలు

September 04th, 10:31 am

పారిస్ లో జరుగుతున్నపారాలింపిక్ క్రీడల్లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో కాంస్యం సాధించిన క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు.

హైజంప్ టీ63 విభాగంలో రజత పతక విజేత శరద్ కుమార్ కు ప్రధాని శుభాకాంక్షలు

September 04th, 10:27 am

పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో రజతం సాధించిన శరద్ కుమార్ కు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

కాంస్యం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్ కు ప్రధాని అభినందనలు

September 04th, 10:25 am

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో కాంస్యం గెలుపొందిన సుందర్ సింగ్ గుర్జర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

రజతం సాధించిన అజిత్ సింగ్ ను అభినందించిన ప్రధానమంత్రి

September 04th, 10:22 am

పారిస్ లో జరుగుతన్న పారాలింపిక్స్ 2024 క్రీడల్లో రజతం సాధించిన అజిత్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో అజిత్ సింగ్ ఈ పతకం సాధించారు.

పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ప్రధాని అభినందనలు

September 04th, 06:40 am

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400మీ.ల టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను అభినందించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

September 03rd, 10:53 am

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ హెచ్6 విభాగంలో ఆమె ఈ పతకం సాధించారు.

పారాలింపిక్స్ లో జావెలిన్ పోటీలో శ్రీ సుమిత్ అంతిల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 03rd, 12:01 am

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.

పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన శీతల్ దేవి, రాకేశ్ కుమార్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 02nd, 11:40 pm

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని క్రీడాకారులు శీతల్ దేవి గారు, రాకేశ్ కుమార్ లు సంఘటిత స్ఫూర్తిని చాటిచెప్పారంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుహాస్ యతిరాజ్ కు ప్రధాని అభినందనలు

September 02nd, 11:35 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో రజతం సాధించిన సుహాస్ యతిరాజ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్ ఈ పతకం సాధించారు.