ప్రసిద్ధ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ కన్నుమూత పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 26th, 07:08 pm

ప్రసిద్ధ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢమైన దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పంకజ్ ఉధాస్ గారి తో శ్రీ నరేంద్ర మోదీ విభిన్న సందర్భాల లో జరిపిన మాటామంతీ ని గుర్తు కు తెచ్చుకొంటూ, శ్రీ పంకజ్ ఉధాస్ గారు భారతీయ సంగీతాని కి ఒక దారి దీపం గా నిలచారు; ఆయన పాడిన మధుర గీతాలు తరాల తరబడి రంజింపచేస్తూ వస్తున్నాయి. ఆయన మనలను వీడి వెళ్లిపోవడం తో సంగీత ప్రపంచం లో ఏర్పడ్డ శూన్యాన్ని భర్తీ చేయడం ఎన్నటికీ సాధ్య పడదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.